జడలో మల్లెపూలు పెట్టి.. చుడిదార్ లో మైమరిపిస్తున్న త్రిష.. ఆ క్యూట్ స్మైల్ కు గుండెలు గల్లంతే..

First Published | Apr 17, 2023, 12:34 PM IST

స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న కుందవై కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా బ్లూ చుడీదార్ లో మెరిసింది.
 

స్టార్ హీరోయిన్, సీనియర్ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కోలీవుడ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ గుర్తుండిపోయే చిత్రాలు చేసి ఆడియెన్స్ గుండెల్లో చోటు సంపాదించుకుంది. 

టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు సరసన త్రిష హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. 20 ఏళ్లకు పైగా సినీ రంగంలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది.
 


ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’తో త్రిషకు మరింత గుర్తింపు దక్కింది. ‘కుందవై’గా బిరుదు కూడా అందుకుంది. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 

తాజాగా PS2 ప్రమోషన్స్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించారు. చిత్రంలోని స్టార్ కాస్ట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిష ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చారు. బ్లూ చుడీదార్ లో మెరిసిపోయింది. క్యూట్ స్మైల్ తో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. 
 

బ్యూటీఫుల్ లుక్ లో త్రిష కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. ఈవెంట్ లో ఈ సీనియర్ భామ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారింది. చుడీదార్ లో యంగ్ లుక్ ను సొంతం చేసుకున్న త్రిష తన చూపులతో, చిరునవ్వుతో ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం ఆ  పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న గ్రాండ్ గా విడుదల కానుంది.  
 

త్రిష నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. విజయ్ దళపతి సరసన చాలా కాలం తర్వాత వెండితెరపై మెరియబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ కొనసాగుతోంది. ఈఏడాది అక్టోబర్ 19న ప్రేక్షకుల ముుందుకు రానుంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ లలో సీనియర్ భామ నటిస్తోంది. 
 

Latest Videos

click me!