NBK108లో తమన్నా భాటియా ఐటెం సాంగ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ.. ఏమంటుందంటే?

First Published | May 20, 2023, 4:46 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తన గురించి రీసెంట్ గా వస్తున్న పుకార్లపై స్పందించారు. NBK108 సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాననడంపై క్లారిటీ ఇచ్చారు.
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia). కొన్నేండ్లుగా మిల్క్ బ్యూటీ ఎన్నో చిత్రాలతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తోంది. గ్లామర్ రోల్స్ లోనే కాకుండా విభిన్న పాత్రలనూ పోషిస్తూ ఆకట్టుకుంటోంది.
 

అయితే, తమన్నా అటు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ‘అల్లుడు శ్రీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వర్’, ‘జై లవ కువ’, ‘సరిలేరు నీకెవ్వరు’, ’గని’ వంటి చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. 
 


ఈ క్రమంలోనే తమన్నా నందమూరి బాలయ్య సరసన ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అనిరావిపుడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ స్పెషల్ అపిరియెన్స్ ఇవ్వబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తమన్నా స్పందించారు. 
 

మిల్క్ బ్యూటీ స్పందిస్తూ.. ’దర్శకుడు అనిల్ రావిపూడి,  నందమూరి బాలకృష్ణ తో కలిసి పనిచేసేందుకు నేను ఎప్పుడూ ఆనందంగా భావిస్తాను. నాకు వారిద్దరి పట్ల చాలా గౌరవం ఉంది. అయితే రాబోయే చిత్రంలో ఒక పాటలో నటిస్తున్నట్టుగా నిరాధారమైన వార్తాలు వస్తున్నాయి. వాటిని చదవడం నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి వార్తలను చెప్పే ముందు దయచేసి పూర్తిగా తెలుసుకోండి‘. అంటూ చెప్పింది.
 

మొత్తానికి తమన్నా భాటియా NBK108లో స్పెషల్ సాంగ్ లో నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
 

ప్రస్తుతం తమన్నా భాటియా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్‘లో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు  మలయాళంలో దిలీప్‌ సరసన `బంద్రా` చిత్రంలో కనిపించబోతుంది. తమిళంలో `అరణ్మనై 4` మూవీలోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!