Shraddha Das : హ్యాపీ బర్త్ డే శ్రద్దా దాస్.. ఆమె గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

First Published | Mar 4, 2023, 10:40 AM IST

గ్లామర్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) పుట్టిన రోజు ఇవ్వాళే. ఈ ఏడాదితో 35వ ఏట అడుగుపెట్టిన ఈ బ్యూటీ గురించి అభిమానుల కోసం  కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇలా..
 

ముంబైకి చెందిన బెంగాలీ ఫ్యామిలీలో నటి శ్రద్ధా దాస్ జన్మించారు. 1987 మార్చి 4న వ్యాపారవేత్త సునీల్ దాస్ - స్వప్న దాస్ దంపతులకు పుట్టిందీ అందాల ముద్దుగుమ్మ. ఈరోజు ఆమె పుట్టిన రోజు. నేటితో శ్రద్ధాదాస్ 35 ఏటా అడుగుపెట్టింది.  ఈ సందర్భంగా  అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
 

15 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న శ్రద్ధా దాస్ గురించి  ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని  ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సినీ  రంగంలో అడుగుపెట్టకముందు.. శ్రద్ధా  పలు అడ్వర్టైస్ మెంట్స్ లలో కనిపించింది. అంతకుముందు ముంబైలోనే తన డిగ్రీని పూర్తి చేసింది.  బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా జర్నలిజం పట్టాను పొందారు. 
 


ఆ తర్వాత థియేటర్ ఆరిస్ట్ గా పలు స్టేజీ పెర్పామెన్స్ లు ఇచ్చారు. ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్టులు పీయూష్ మిశ్రా లాంటి వారు నిర్వహించిన వర్క్ షాప్స్ లలోనూ హాజరైంది. అక్కడ నటనా నైపుణ్యాన్ని పొందిన శ్రద్ధా  గ్లాడ్ ర్యాగ్స్ 400 క్యాటల్యాగ్స్ కు సంబంధించిన ప్రింట్ అడ్వర్టైజ్ మెంట్స్ లో కనిపించినట్టు సమాచారం. 
 

ఎందరో నార్త్ బ్యూటీలు తెలుగు సినిమాలతో వెలిగిపోయినట్టే శ్రద్ధా  కూడా తన కేరీర్ ను టాలీవుడ్ ఎంట్రీతోనే ప్రారంభించింది. ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలిచిత్రంతోనే తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానే చాలా సినిమాల్లో మెరిసింది. 
 

టార్గెట్, 18,20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత్రి, ముగ్గురు, మొగుడు వంటి  చిత్రాలతో హీరోయిన్ గా అలరించే ప్రయత్నం చేసింది.  కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రద్ధా నటించిన సెకండ్ లీడ్ రోల్స్ మాత్రం మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ‘ఆర్య -2’, ‘డార్లింగ్’, ‘నాగవల్లి’,‘గుంటూరు టాకీస్’,‘డిక్టేటర్’ వంటి చిత్రాల్లో శ్రద్ధా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
 

దక్షిణాదిలోని అన్ని భాషల్లోని చిత్రాల్లో నటించి సౌత్ ఆడియెన్స్ ను అలరించిన శ్రద్ధా దాస్ తెలుగులో మాత్రం ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. నటిగా వెండితెరపైనే కాకుండా.. ‘ఢీ15’ డాన్స్ షోతో బుల్లితెరపైనా అలరిస్తున్నారు. ఈ షో తర్వాత మరింత క్రేజ్ దక్కించుకున్నారు. సినిమాల  విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఏదేమైనా శ్రద్ధాకు మంచి హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Latest Videos

click me!