కుర్ర మనస్సులను ఇరగొట్టే మిషీన్.. పింక్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న శ్రద్దా దాస్ పోజులు..

First Published | May 5, 2023, 3:07 PM IST

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das) నెట్టింట గ్లామర్ మెరుపులతో సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్స్ లో కేక పెట్టిస్తున్నారు. లేటెస్ట్ లుక్ లో శ్రద్ధా కుర్ర మనస్సులను విరగొట్టేసింది. 
 

యంగ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ తన గురించి, తన కేరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనిమిస్తూ అదరగొడుతున్నారు. 
 

ప్రస్తుతం శ్రద్ధా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉంటోంది. సినిమాల పరంగా కాస్తా వెనకబడి ఉన్నప్పటికీ.. టీవీ షోలు, వెబ్ సరీస్ లతో మాత్రం అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వరుస ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది.
 


శ్రద్ధా దాస్ ప్రస్తుతం Dhee15లో లేడీ జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. షోలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ట్రెండీ అండ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోండా చేస్తున్న విషయం తెలిసిందే.
 

తాజాగా శ్రద్ధా ‘ఢీ15’షో కోసం స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. పింక్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. స్లీవ్ లెస్ వన్ షోల్డర్ మినీ టాప్, ట్రౌజర్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. మెరిసిపోతున్న యాపిల్ పండులా కనిపించింది. అందంతోనే కుర్రాళ్ల మనస్సును విరగొట్టేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గా ‘ఢీ’ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కు శ్రద్దా విచారం వ్యక్తం చేశారు. చైతన్య ఆత్మహత్య తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఢీ కొరియోగ్రాఫర్స్, డాన్సర్లు కూడా స్పెషల్ పెర్ఫామెన్స్ తో చైతన్యకు నివాళి కూడా అర్పించారు. ప్రస్తుతం డాన్స్ షో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. 

కేరీర్ విషయానికొస్తే శ్రద్ధా నటించిన ‘నిరీక్షణ’, ‘అర్థం’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. బుల్లితెరపై మాత్రం ‘ఢీ’షోతో అలరిస్తోంది.  రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Latest Videos

click me!