‘ఖుషి’ మ్యూజిక్ కాన్సెర్ట్.. నయా లుక్ లో అదరగొట్టిన సామ్.. కిర్రాక్ అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ ఫోజులు

First Published | Aug 15, 2023, 8:04 PM IST

స్టార్ హీరోయిన్ సమంత స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. విజయ్ తో కలిసి నటించిన ‘ఖుషి’ చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందుతున్న సమంత (Samantha)  ప్రస్తుతం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలో వెకేషన్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.
 

ఇక ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. చివరిగా సామ్ ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ సినిమా ‘ఖుషి’తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తోంది. 
 


‘ఖుషి’లో డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. బిగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. సెప్టెంబర్ 1న అన్ని భాషల్లో చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 
 

ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని HICC సెంటర్ లో Kushi Music Concertను నిర్వహిస్తున్నారు. ఈవెంట్ లో సామ్, విజయ్ తదితరులు హాజరవుతున్నారు.
 

అయితే, మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం సామ్ నయా లుక్ లో మెరిసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లోని ట్రెండీ వేర్ లో మెరిసింది. తన ప్యాషన్ ను చూపిస్తూ లేటెస్ట్ లుక్ లో ఫొటోషూట్ కూడా చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో అదరగొట్టింది. 
 

చాలా కాలం తర్వాత సామ్ స్టైలిష్ గా, స్టన్నింగ్ గా మెరవడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సామ్ నయా లుక్ తో అదరగొట్టింది.
 

Latest Videos

click me!