కుర్ర గుండెల్లో అందాల బాణాలు దించుతున్న సదా.. ట్రెడిషనల్ వేర్ లోనూ ఇంతలా గ్లామర్ మెరుపులా..

First Published | Jul 9, 2023, 12:03 PM IST

సీనియర్ భామ సదా (Sadha) బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. పద్ధతిగా మెరుస్తూనే కుర్ర గుండెల్లో అలజడి సృష్టిస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో మరింత బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది.
 

‘జయం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సదా తొలిచిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. వెండితెరకు పరిచయమైన వెంటనే తెలుగు, తమిళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది.
 

కొన్నేళ్ల పాటు కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస చిత్రాలతో సదా సందడి చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 


అయితే, ప్రస్తుతం సదా సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నారు. ఐదేళ్లుగా ఈ బ్యూటీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఏ సినిమాకు ఈమె ఓకే చెప్పకపోవడంతో కాస్తా అభిమానులను అప్సెట్ చేస్తోంది. తిరిగి మళ్లీ ఎప్పుడు వెండితెరపై అలరిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. 
 

వెండితెరకు దూరమైన సదా బుల్లితెరపై మాత్రం దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు అలరించింది. పాపులర్ డాన్స్ షో Dhee ద్వారా జడ్జీగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పైనా ఆయా షోల్లో మెరుస్తూ వస్తోంది. 

Dhee14 తర్వాత సదా స్మాల్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘నీతోనే డాన్స్’ షోలో సందడి చేస్తోంది. ఈషో ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం సదా బ్యూటీఫుల్ డ్రెస్ లో దర్శనమిచ్చింది.
 

సోషల్ మీడియాలోనూ సదా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఎప్పకటిప్పుడు నయా లుక్ లో ఫొటోషూట్లు చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం మరింత అందంగా మెరిసింది.
 

తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో సదా వెలిగిపోతోంది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తున్న సదా..తాజాగా ఆరెంజ్ కలర్ హాఫ్ శారీ లాంటి డ్రెస్ లో కనువిందు చేసింది. అటు ట్రెండీ లుక్, ఇటు ట్రెడిషనల్ టచ్ తో ఆకట్టుకుంది.

ఫొటోషూట్ లో భాగంగా సదా మైమరిపించేలా ఫోజులిచ్చింది. మెరిసిపోయే అందంతో మతులుపోయేలా స్టిల్స్ ఇచ్చింది. కవ్వించే చేష్టలతో కుర్రాళ్లను కలవరపెట్టింది. మత్తు చూపులు, బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. మరోవైపు యంగ్ హీరోయిన్లకు పోటీగా సదా ఫొటోషూట్లు చేస్తూ వస్తుండటం విశేషం. ఇక సదా చివరిగా ‘హాలో వరల్డ్’ సిరీస్ లో మెరిసింది. 
 

Latest Videos

click me!