ఫ్రంటూ, బ్యాక్ పోజులతో సదా గ్లామర్ విందు.. బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ‘జయం’ బ్యూటీ

First Published | Feb 8, 2023, 1:26 PM IST

సీనియర్ హీరోయిన్ సదా (Sadha) ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఓ షోకోసం తాజాగా సదా చేసిన ఫొటోషూట్ స్టన్నింగా ఉండటంతో పాటు అందాల విందూ అదిరింది. 
 

టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జయం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు అందుకున్నారు.
 

నార్త్ కు చెందిన ఈ అందాల ముద్దుగుమ్మ తన కేరీర్ ను తెలుగు సినిమాలతోనే ప్రారంభించారు. ‘జయం’ సూపర్ హిట్ కావడంతో.. వెన్వెంటనే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ‘ప్రాణం’,‘నాగా’, ‘దొంగా దొంగది’, ‘లీలా మహల్ సెంటర్’‘అవున్నాన్న కాదన్న’, చుక్కల్లో చంద్రుడు’ వంటి చిత్రాల్లో నటించారు.
 


తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన నటించిన ‘అపరిచితుడి’తో సదా సౌత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అక్కడి నుంచి కొన్నేండ్ల పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. అయితే నాలుగేండ్లుగా ఈ బ్యూటీ వెండితెపైన మాత్రం వెరవలేదు. 
 

దీంతో ఈ బ్యూటీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించారు. మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లను ధరిస్తూ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తున్నారు. 
 

తాజాగా సదా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఫొటోల్లో సదా అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఫ్రంటూ, బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. మరోవైపు మత్తు చూపులతో యువతను చిత్తు చేసింది.

ఇటీవల సదా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను ఆరబోస్తోంది. సదా తన అభిమానులతో పంచుకునే అందమైన ఫొటోలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.  

Latest Videos

click me!