గ్రీన్ గౌన్ లో తెలుగు హీరోయిన్ స్టన్నింగ్ లుక్.. బ్యూటీఫుల్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న రీతూ వర్మ

First Published | Jul 29, 2023, 10:30 PM IST

‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన వెకేషన్ కు సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది. స్టన్నింగ్ లుక్ లో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. 
 

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma)  హైదరాబాద్ లోనే పుట్టిపెరిగింది. ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ తో ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు దక్కింది. దాంతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. తొలుత ఎన్టీఆర్ ‘బాద్షా’లో సపోర్టింగ్ రోల్ లో మెరిసింది. 
 

ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘పెళ్లి చూపులు’ సినిమాలో నటించి మంచి హిట్ ను సొంతం చేసుకుంది. తన పెర్ఫామెన్స్ కు నంది అవార్డు కూడా దక్కింది. 
 


ఫస్ట్ హిట్ అందుకున్న తర్వాత హీరోయిన్ గా రీతూ వర్మకు తెలుగులో వరుస ఆఫర్లు అందాయి. అలాగే తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో కంటే కూడా తమిళంలోనే నటిస్తూ బిజీగా ఉంది. 

ఇదిలా ఉంటే.. రీతూ వర్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. కాస్తా ఆలస్యంగానైనా ఈ ముద్దుగుమ్మ పోస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

తన సమ్మర్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో రీతూ వర్మ గ్రీన్ డ్రెస్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో కనిపించింది. సిటీ అందాలను చూస్తూ సంతోషిస్తున్నట్టుగా దర్శనమిచ్చింది. మరోవైపు గ్రీన్ గౌన్ లో తెలుగు అందం మరింతగా ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. 
 

అయితే తన సమ్మర్ వెకేషన్ ను క్యూబెక్ నగరం, మాంట్రియల్ లోకేషన్లలో గడిపినట్టు  తెలిపింది. తన బెస్ట్ సమ్మర్ ట్రిప్ అంటూ లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది. ఇక రీతూ వర్మ తమిళంలో ‘మార్క్ ఆంటోనీ’, ‘ధృవ నక్షత్రం’ వంటి సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో చివరిగా ‘ఒకే ఒక జీవితం’తో అలరించింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ అందలేదు. 
 

Latest Videos

click me!