మెడిటేషన్ చేస్తూ రకుల్ ప్రీత్ దర్శనం.. ట్రెడిషనల్ వేర్ లో మెరిసిపోతున్న ఢిల్లీ బ్యూటీ

First Published | May 21, 2023, 1:47 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ట్రెడిషనల్ వేర్లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ మెడిటేషన్ పై సూచనలు చేస్తోంది.

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు రకుల్ ప్రీత్ సింగ్ వెలుగొందిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక కొద్దికాలంగా రకుల్ తెలుగు సినిమాల వైపు చూడకపోవడం గమనార్హం. 
 

ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దుమ్ములేపింది. గతేడాది వరుసగా ఐదు సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ను అలరించింది. అక్కడ హీరోయిన్లకు పోటీగా అవకాశాలను అందుకుంది. వాటి ఫలితాలు ఆశించిన మేర లేకపోవడంతో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.


దీంతో మళ్లీ సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టిందీ ఫిట్ నెస్ గర్ల్. ఈ క్రమంలో తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఈక్రమంలోనే రకుల్ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. క్రేజీ పోస్టులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

ఇక రకుల్ ప్రీత్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ద తీసుకుంటారో తెలిసిందే. జీరో ఫ్యాట్ బాడీని మెయిటేయిన్ చేస్తూ ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా జిమ్ లోనే సమయం గడుపుతుంటారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే జిమ్ ట్రెయిన్ గా మారేదనే విషయం తెలిసిందే. 
 

ఈ క్రమంలో తాజాగా రకుల్ మెడిటేషన్ పైనా సూచనలు చేస్తోంది. మెడిటేషన్ వల్ల మనస్సు ఉత్సాహంగానూ, ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు చైర్ లో కూర్చొని మెడిటేట్ చేస్తుండగా ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

మరోవైపు మొన్నటి వరకు గ్లామర్ మెరుపులు మెరిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ తమిళంలో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!