స్టైలిష్ వేర్ లో రకుల్ ప్రీత్ కిల్లింగ్ లుక్స్... ఆ విషయంలో ఢిల్లీ భామ స్టైలే వేరు..

First Published | Jul 12, 2023, 4:33 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  వరుస ఫొటోషూట్లతో నెట్టింటిని షేక్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. కిర్రాక్ ఫోజులతో కట్టిపడేస్తోంది.
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బడా హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సాధించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు రకుల్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అటు తమిళ చిత్రాల్లోనూ నటించలేదు. నాలుగైదు చిత్రాలతో బాలీవుడ్ లో దుమ్ములేపింది. కానీ ఆ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో రకుల్ జోరుకు బ్రేక్ లు పడ్డాయి. 


దీంతో మళ్లీ దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. మళ్లీ సౌత్ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది.
 

ఇటీవల వరుస ఫొటోషూట్లతో రకుల్ ప్రీత్ సందడి చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది.  కిల్లింగ్ ఫోజులతో ఆకట్టుకుంది. సిల్వర్ సూట్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంది. రోటీన్ కు భిన్నంగా దుస్తులు ధరిస్తూ వస్తోంది. నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది.
 

ఫిట్ నెస్ విషయంలోనే కాకుండా రకుల్ ప్రస్తుతం ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. న్యూ ట్రెండ్ సెట్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లో కిల్లింగ్ ఫోజులతో, మత్తు చూపులతో మైమరిపించింది. సోఫాపై సిట్టింగ్ పొజిషన్ లో స్టిల్స్ ఇచ్చి  మెస్మరైజ్ చేసింది. 
 

కెరీర్ విషయానికొస్తే.. రకుల్ త్వరలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో సౌత్ ఆడియెన్స్ ను అలరించనుంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’తో పాటు శివకార్తీకేయ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. త్వరలో థియేటర్లలోకి రానున్నాయి. ఇక తెలుగులో చివరిగా ‘కొండపొలం’లో నటించింది. నెక్ట్స్ ఏ సినిమాతో వస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!