టోర్న్ జీన్స్ లో నాని హీరోయిన్ గ్లామర్ మెరుపులు.. ట్రెండీ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ప్రియాంక మోహన్

First Published | Mar 25, 2023, 1:30 PM IST

సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ ట్రెండీ అవుట్ ఫిట్స్ లోనూ అదరగొడుతోంది. తాజాగా టోన్ జీన్స్ లో దర్శనమిచ్చింది అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

నేచురల్ స్టార్ నాని (Nani)  సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో  ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో ప్రియాంక నటన, అందానికి నాని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా హిట్ కాకపోయినా ప్రియాంకకు మాత్రం మంచి క్రేజ్ దక్కింది.
 

ఆ తర్వాత  శర్వానంద్ సరసన ‘శ్రీకారం’ చిత్రంలో అలరించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రియాంక కు తెలుగులో అవకాశాలు తగ్గాయి. చేసేదేమీ లేక కోలీవుడ్ వైపు మళ్లింది. ప్రస్తుతం అక్కడ వరుస చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. 
 


తమిళ స్టార్ హీరో సూర్య సరసన ‘ఈటీ’ లో నటించినా పెద్దగా ఫలితం లేకపోయింది.  కానీ చివరిగా వచ్చిన శివకార్తీకేయ చిత్రం ‘డాన్’తో మంచి హిట్ అందుకుంది. దీంతో ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. 

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. తనను అభిమానించే వారి కోసం ప్రియాంక మోహన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ తన అందంతో ఆకట్టుకుంటుంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. 

గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండే ప్రియాంక మోహన్ ట్రెడిషనల్ లుక్ తోనే అలరించేది.  అప్పుడప్పుడు ట్రెండీ వేర్స్ ధరించేది. ఇక ఫస్ట్ టైమ్ టోన్ జీన్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. టైట్ టోన్ జీన్స్ లో థైస్ అందాలను ఇలా ప్రదర్శించింది.  రెడ్ టాప్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

స్టన్నింగ్ సిట్టింగ్ పోజులతో ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ కట్టిపడేస్తోంది. ఫ్యాన్స్ కూడా ఆమెను ట్రెడిషనల్ గా, కొంచెం మోడ్రన్ గా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!