క్యాజువల్స్ లోనూ ప్రణీత గ్లామర్ మెరుపులు.. కొంటె పోజులతో కవ్విస్తున్న బుట్టబొమ్మ!

First Published | Jan 26, 2023, 3:09 PM IST

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) గ్లామర్ మెరుపులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకున్నాయి. 

గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తన అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించి కట్టిపడేసిందీ ముద్దుగుమ్మ. వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

వివాహా బంధంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ రెండేండ్లుగా సినిమాకు దూరంగా ఉంది. పెళ్లి  ప్రెగ్నెన్సీ కారణంగా కాస్తా  బ్రేక్ వచ్చింది. 2021 మేలోనే వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత సుభాష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022 జూన్ 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. 


పెళ్లి, ప్రెగెన్సీ కారణంగా రెండేండ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటోందీ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ  యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో అభిమానులతో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ప్రణీత ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. భర్తను, కూతుర్ని చూసుకుంటూ భార్యగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక పెళ్లి తర్వాత ప్రణీత కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు.సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ చిత్రంతో అలరిస్తుందో చూడాలి.     

మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. సినిమాల అప్డేట్స్ ఇవ్వకున్నా.. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తోంది.  అదేవింధంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు చేస్తోంది.  ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తోంది. 

తాజాగా క్యాజువల్ డ్రెస్ లో దర్శనమిచ్చిందీ బ్యూటీ. లైట్ గ్రీన్ ట్రాన్స్ ఫరెంట్ షర్ట్, వైట్ పాంట్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. కొంటె పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. ప్రణీత పంచుకున్న ఫొటోలపై అభిమానులు క్రేజీగా కామెంట్లు పెడుతూ ఫొటోలను  వైరల్ చేస్తున్నారు.    

Latest Videos

click me!