కూతురు పుట్టిన ఆనందంలోనే మునిగి తేలుతున్న ప్రణీత.. ట్రెండీ గౌన్ లో పవన్ హీరోయిన్ క్యూట్ ఫొటోషూట్

Published : Jun 17, 2022, 05:36 PM ISTUpdated : Jun 17, 2022, 05:46 PM IST

 కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ఇటీవలె పండంటి ఆడ బిడ్డకు  జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఇంకా ఆ ఆనందంలోనే మునిగి తేలుతోంది. కొద్ది  రోజులు  అభిమానులకు దూరంగా ఉన్నఈ బ్యూటీ తాజాగా క్యూట్ ఫొటోషూట్ తో దర్శనమిచ్చింది. 

PREV
16
కూతురు పుట్టిన ఆనందంలోనే మునిగి తేలుతున్న ప్రణీత.. ట్రెండీ గౌన్ లో పవన్ హీరోయిన్ క్యూట్ ఫొటోషూట్

హీరోయిన్ ప్రణీత సుభాష్ 1992లో బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వైద్యుడు, తల్లి గైనకాలజిస్ట్ కావడం విశేషం. వీరికి బెంగళూరులో ఓ ఆసుపత్రి ఉంది. ఇఫ్పటికీ ఆ హాస్పిటల్ కొనసాగుతోంది. ప్రణీత ఒక్కతే కూతురు. దీంతో ఆమె ఇంట్లో ఆడిందే ఆట.. పాడిందే పాట. తన ఇష్టానికి నో చెప్పే వాళ్లు మాత్రం ఉండరంట.
 

26

అందుకే ఈ బ్యూటీ తనకు  ఎంతో ఇష్టమైన మోడలింగ్ ను ఎంచుకొని గుర్తింపు  తెచ్చుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ ‘పోర్కి’తో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ కు మాత్రం ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో పరిచయం అయ్యింది.
 

36

ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ‘పోర్కి’ హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన ‘బావ’ చిత్రం ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.  ఆ తర్వాత పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించి బుట్టబొమ్మగా పేరొందింది. అనంతరం వచ్చిన ‘హాలో గురు ప్రేమకోసమే’ చిత్రంలోనూ నటించి క్రేజ్ పెంచుకుంది.
 

46

ఇదిలా ఉంటే ప్రణీత సుభాష్.. గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది పూర్తి అయ్యింది. ఏప్రిల్ 11న తన భర్త పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు శుభావార్త చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 10న బెంగళూరులో పండంటి బిడ్డకూ జన్మనిచ్చింది ప్రణీత.

56

తన బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి ప్రణీత ఆనందంలో మునిగి తేలిపోతోంది. గతంలో కంటే కొత్తరకం జోష్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. హెల్దీగానూ, గ్లామరస్ గా కనిపిస్తోంది. తన డెలివరీ తర్వాత  తొలిసారిగా ఫొటోషూట్ చేసిందీ బ్యూటీ. కొద్ది రోజులుగా అభిమానులకు దూరంగా ఉన్న ప్రణీతా.. తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
 

66

లేటెస్ట్ గా తన అభిమానుల కోసం ప్రణీత  ట్రెండీ గౌన్ లో ఫొటోషూట్ నిర్వహించింది. ఓ టేబుల్ పై కూర్చున్న ప్రణీత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది. అలాగే పూల గౌన్ లో ప్రణీత అందం మరింతగా మెరిసిపోతోంది. ఫొటోలకు  క్యూట్ గా ఫోజులిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోందీ బ్యూటీ. తాజాగా తను పోస్ట్  చేసిన పిక్స్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories