రెండేండ్ల కింద వ్యాపార వేత్త నితిన్ రాజుతో ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. 2021 మేలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య బుట్టబొమ్మ వివాహం జరిగింది. చాలా సీక్రెట్ గానే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.
గతేడాది ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసింది. 2022 జూన్ 10న బెంగళూరులోని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొంది.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. మొన్నటి వరకు కుటుంబ సభ్యులతోనే సంతోషంగా గడిపింది.
పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు కాస్తా దూరమైన ప్రణీతా సుభాష్ అభిమానులకు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వచ్చింది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది.
కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ప్రణీతా సుభాష్ సోషల్ మీడియాలో తన అందంతో కటిపడేస్తోంది. బుట్టబొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఎప్పుడో ఫిదా అయిన విషయం తెలిసిందే.. కానీ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చినా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ప్రణీతా సుభాష్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కట్టిపడేస్తూ ఉంది. బిగుతైన టాప్ లో బ్యాక్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. మరింత గ్లామర్ డోస్ పెంచుతూ ఆకట్టుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ లైక్స్, కామెంట్ల పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రణీతా ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.అవకాశాలను అందుకునేందుకు ఇలా మెరుస్తూ వచ్చింది. ఈ క్రమంలో ప్రణీతా తొలిసారిగా మలయళంలో నటించబోతోంది. మలయాళ స్టార్ దిలీప్ కుమార్ 148లో హీరోయిన్ గా నటిస్తున్నారు.