స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ప్రగ్యా జైశ్వాల్ మెరుపులు.. కొంటె పోజులతో అట్రాక్ట్ చేస్తున్న బాలయ్య భామ..

First Published | Apr 22, 2023, 1:57 PM IST

‘అఖండ’ భామ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) స్టన్నింగ్ పోజులతో అదరగొడుతోంది. వీకెండ్ సందర్భంగా టూర్ ప్లాన్ చేసుకున్నట్టుంది. ఈ సందర్బంగా కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 
 

యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. పూర్తిగా తెలుగు సినిమాలపైనే  ఆధారపడ్డ ఈ ముద్దుగుమ్మ ఫ్లాప్స్, హిట్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటోంది.
 

ప్రగ్యా చివరిగా ‘అఖండ’ చిత్రంతో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాలయ్య సరసన ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బాస్టర్ హిట్ దక్కడంతో ఇండస్ట్రీలో ప్రగ్యా జైశ్వాల్ పేరు మారుమోగింది. దెబ్బకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
 


కానీ ప్రగ్యా మాత్రం తన నెక్ట్స్ సినిమాను ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. ఈముద్దుగుమ్మ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య ఇచ్చిన క్రేజ్ ను ఎలా వినియోగించుకుంటోందనేనది చూడాలి. కానీ ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. 
 

ఇదిలా ఉంటే.. ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఆయా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. షోరూమ్ ల ప్రారంభోత్సవాలకు హాజరవుతూ తెగ సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

తాజాగా మాత్రం ప్రగ్యా ఓ ఫారెస్ట్ ను సందర్శించినట్టు తెలుస్తోంది. వైట్ ఫ్రాక్ లో స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ ర్యాంప్ పై ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను కొద్దిసేపటి కింద అభిమానులతో పంచుకుంది. కొంటె ఫోజులతో ఆకట్టుకుంది. 
 

ప్రగ్యా షేర్ చేసిన పిక్స్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. వైట్ ఫ్రాక్ లో క్యూట్ గా ఫోజులిస్తూ కట్టిపడేసింది. గాగూల్స్ ధరించి, స్టైలిష్ గా మెరిసింది. ఇటీవల అందాల విందులో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇలా సింపుల్ లోనూ దర్శనమిచ్చి అట్రాక్ట్ చేస్తోంది. 
 

Latest Videos

click me!