నటి ప్రగతి శుక్రవారం అంతర్జాతీయ డాన్స్ డే ని పురస్కరించుకుని డాన్స్ వీడియోని పంచుకుంది. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్, కలర్ మిక్సింగ్ ఉన్న శారీ కట్టి అదరగొట్టింది.
`జంపింగం.. పంపింగం.. `అంటూ సాగే ఓ తమిళ పాటకి అదిరిపోయేలా స్టెప్పులేసింది. తన స్నేహితురాలు సైతం కిర్రాక్‌పుట్టేలా డాన్స్ చేయడం విశేషం. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.
డాన్స్ డే ఫోకస్ మొత్తం ఇప్పుడీ వీడియోతో తన వైపు తిప్పుకుంది ప్రగతి. ఈ వీడియో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు ప్రగతి డాన్స్ ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. `ఇంటర్నేషనల్ డాన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇలా ఉండాలి.. అంతేగా.. అంతేగా..`అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు.
`రెడ్ హాట్.. ఎల్లో టూ హాట్` అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంటే రెడ్ శారీ కట్టిన ప్రగతి హాట్‌గా ఉందని, ఎల్లో శారీ కట్టిన ఆమె స్నేహితురాలు మరింత హాట్‌గా ఉందంటున్నారు. ప్రగతి మేడమ్ మీరు రాక్ అంతే అని, ప్రగతి ఆంటీ జిమ్‌లోనే కాదు, డాన్స్ లోనూ దుమ్మురేపుతుందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల కూడా ప్రగతి తన సోషల్ మీడియా అకౌంట్లలో డాన్స్ వీడియోలు పంచుకుంది. అయితే వాటన్నిటికంటే ఈ రోజు పంచుకున్న డాన్స్ వీడియో మాత్రం హైలైట్‌గా మారింది. స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేస్తుంది.
నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ సహా పలు వీడియోలను అభిమానులతో పంచుకుని ఆకట్టుకుంది.
తాజాగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి పాపులర్ 'ఫేమస్ డ్రీమమ్ వేకపమ్' అనే సాంగ్‌కు చిందేసింది. చీరకట్టులో మాస్ స్టెప్పులతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.
గతంలోనూ `బొంబాయి` చిత్రంలోని `హమ్మ.. హమ్మ..` పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసి అందరిని ఆకట్టుకుంది. ఇటీవల విజయ్ నటించిన `మాస్టర్` మూవీ సాంగ్‌కు తన కుమారుడితో కలిసి లుంగితో తీన్మార్ స్టెప్పులేసి ఫిదా చేసింది ప్రగతి.
ప్రస్తుతం ప్రగతి తెలుగులో `ఎఫ్3`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రాల్లో, అలాగే తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టీవీలో `మమతల కోవెల` అనే సీరియల్‌లో లీడ్‌గా చేస్తుంది ప్రగతి.