మేకప్ లేకుండా షాకిచ్చిన బుట్టబొమ్మ.. ఎర్రటి బుగ్గలు చూపిస్తూ స్లీవ్ లెస్ టాప్ లో పూజా అందాల సెల్ఫీలు..

First Published | Apr 2, 2023, 2:39 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) అభిమానులతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. తాజాగా తను బ్యూటీఫుల్ లుక్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. 
 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం  లేదు. బడా హీరోల సరసన నటిస్తూ సౌత్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ దుమ్ములేపుతోంది. 
 

పూజా హెగ్దే చేతిలో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. ఒకటి బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో నటిస్తోంది.  ఈ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 28న అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  
 


మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన  SSMB28లోనూ నటిస్తోంది. మహేశ్ సరసన రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి.  ఇక పూజా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

వరుస చిత్రాలతో అలరిస్తున్న పూజా హెగ్దే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీకెండ్ న్యూస్ అందించింది. ఈరోజు ఉదయం వర్కౌట్ చేసినట్టు తెలిపింది.  ఆ తర్వాత సెల్ఫీలకు ఫోజులిచ్చింది. అయితే మేకప్ లేకుండా బుట్టబొమ్మ దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది.
 

ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో పూజాగా హెగ్దే వర్కౌట్ ఇరగదీసినట్టు తెలిసింది. అయితే వర్కౌట్ చేయడం ద్వారా మరింత అందంగా కనిపిస్తామని చెప్పుకొచ్చింది. లేటెస్ట్ సెల్ఫీలను పంచుకుంటూనే.. ‘మంచి వ్యాయామం తర్వాత ఆ ఎర్రబడిన బుగ్గలు’ చూడండి  అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

పూజా పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేకప్ లేకున్నా చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తున్నావంటూ ఫ్యాన్స్ పొగుడుతున్నారు. మరోవైపు ఆరోగ్యం, హెల్త్,  అందంపై ఇలా శ్రద్ధ వహిస్తున్నందుకు కామెంట్ల రూపంలో మెచ్చుకుంటున్నారు.  పూజా ఇలా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ సందడి చేస్తూనే ఉన్నారు.

Latest Videos

click me!