స్లీవ్ లెస్ ఫ్రాక్ లో పూజా హెగ్దే మెరుపులు.. క్యూట్ స్మైల్ తో కుర్ర గుండెలకు గాలం వేస్తున్న బుట్టబొమ్మ..

First Published | Apr 23, 2023, 3:21 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) నటించిన ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బుట్టబొమ్మ వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) తాజాగా నటించిన చిత్రం Kisi Ka bhai Kisi ki Jaan. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈద్ సందర్భంగా చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకుపోతోంది.
 

వరుస పరాజయాలనే మూటగట్టుకుంటున్న పూజా హెగ్దేకు ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందిస్తుందని ఆశించింది. కానీ ఆశించిన మేర హిట్ అందుకోలేకపోయినట్టు కనిపిస్తోంది. దీంతో నెక్ట్స్ గురూజీ త్రివిక్రమ్ దర్శక్వంలోని SSMB28పైనే పూజా ఆశలు పెట్టుకుంది. చివరిగా కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లోని ‘అలా వైకుంఠపురం’తోనే  సక్సెస్ అందుకుంది.
 


గతేడాది పూజా హెగ్దే ఏకంగా నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ తో అలరించే ప్రయత్నం చేసింది. కానీ చిత్రాలు ఆశించిన మేర ఫలితాలనివ్వలేదు. సల్మాన్ కాన్ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకుంటుందని భావించారు. కానీ భారీ సక్సెస్ అందడం కష్టమేనని తెలుస్తోంది.
 

ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాత్రం పూజా హెగ్దే ఎంత యాక్టివ్ గా కనిపించిందే తెలిసిందే. సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట  సైతం తెగ సందడి చేసింది. ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్దే పంచుకున్న కొన్ని పొటోలు ఫ్యాన్స్  తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

లేటెస్ట్ స్టిల్స్ లో పూజా హెగ్దే గ్రీన్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. షోల్డర్ అందాలతో ఆకట్టుకుంటుంది. సోఫాపై పద్ధతిగా కూర్చొని చిలిపి పోజులు, చిరునవ్వుతో కట్టిపడేసింది. మత్తు కళ్లతో కుర్ర గుండెల్ని దోచుకుంది. దీంతో ఆమె ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

పూజా కేరీర్ విషయానికొస్తే.. త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలోని ‘ఎస్ఎస్ఎంబీ28’తోనే పూజాకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. చిత్రంలో శ్రీలీలా కూడా నటిస్తోంది.

Latest Videos

click me!