బెడ్ పై పాయల్ రాజ్ పుత్ విరహ వేదన.. థైస్ షో చేస్తూ మతులు పోగొడుతున్న ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ..

First Published | Jul 3, 2023, 10:13 AM IST

యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  లేటెస్ట్ ఫొటోషూట్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. బెడ్ పై మతులపోయేలా ఫోజులిస్తూ నెటిజన్ల మతులు పోయేలా చేస్తోంది.  
 

నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తొలుత సీరియల్ నటిగా తన కేరీర్ ను ప్రారంభించింది. చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. దాంతోనే ఫస్ట్ పంజాబీ చిత్రంలో హఈరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో ఓ సినిమా చేసి కాస్తా గుర్తింపు దక్కించుకుంది. 
 

ఇక నేరుగా ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ హీరో కార్తీకేయ సరసన బోల్డ్ పెర్ఫామెన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. తొలిచిత్రంతోనే ఇక్కడ మంచి హిట్ ను అందుకుంది. 
 


ఆ తర్వాత తెలుగు నుంచి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. దాంతో నెమ్మది ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. 
 

ఈ గ్యాప్ లో అటు తమిళం, పంజాబీ, కన్నడ చిత్రాల్లో మెరుస్తూ వచ్చింది. ఇక మరోసారి ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ ను అందుకునేందుకు సిద్ధం అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi)  డైరెక్షన్ లో వస్తున్న ‘మంగళవారం‘లో నటిస్తోంది. 
 

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సెన్సేషన్ గా మారింది.  హాఫ్ న్యూడ్ గా కనిపించి పాయల్ షాకిచ్చింది. మరోవైపు ఎమోషనల్ గా కథా సాగుతుందని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మరింతగా అందాల రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులుపోగొడుతోంది. తాజాగా బెడ్ పై విరహ వేదనతో రెచ్చిపోయింది. టెంప్టింగ్ ఫోజులతో హీటెక్కించింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!