సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ‘ధమ్కీ’ బ్యూటీ.. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేస్తున్న నివేతా పేతురాజ్

First Published | Jul 9, 2023, 4:56 PM IST

తమిళ హీరోయిన్ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) ప్రస్తుతం తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. 
 

యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ కోలీవుడ్ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ కాస్తా క్రేజ్ దక్కడంతో వెంటనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ’మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను పరిచయం చేసుకుంది. 
 

ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరు’, ‘రెడ్’, ‘పాగల్’, ‘బ్లడీ మేరీ’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో అలరించింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా మంచి పేరు సంపాదిస్తోంది. దీంతో అవకాశాలు కూడా అందుతున్నాయి.
 


చివరిగా ఈ ముద్దుగుమ్మ విశ్వక్ సేన్ సరసన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ కాస్తా గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రం అంతంతా మాత్రానే ఆడింది. అయినా విశ్వక్ సేన్, నివేతా పెర్ఫామెన్స్  ఆకట్టుకుంది. 
 

ఇదిలా ఉంటే.. నివేతా అటు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ మెరుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి మరింతగా దగ్గరవుతోంది. తాజాగా ఓ టెంపుల్ ను సందర్శించిన సందర్భంగా పోస్టు చేసింది.
 

చెన్నైలోని ఓ ఫేమస్ టెంపుల్ ను సందర్శించిన నివేతా ఆలయం ముందు క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఫ్యాన్స్  తో పంచుకుంది. ట్రెడిషనల్ లుక్ లో చాలా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అచ్చం తెలుగమ్మాయిలాగే తయారై ఆకట్టుకుంటోంది.
 

ఎల్లో చుడీదార్ లో నివేతా ఆకర్షించింది. ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ స్మైల్, క్యూట్ ఫోజులు, క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. దీంతో ఫ్యాన్స్ నివేతా పేతురాజ్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

Latest Videos

click me!