అందంతో మత్తెక్కించడం మృణాల్ కు అలవాటేమో.. ఆరెంజ్ డ్రెస్ లో అదిరిపోయిన ‘సీతారామం’ బ్యూటీ..

First Published | Apr 14, 2023, 1:07 PM IST

క్రేజీ  హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తోంది. లేటెస్ట్ గా సీతారామం బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
 

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రోజురోజుకు అందంగా తయారవుతూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. 

ఇప్పటికే బికినీల్లో దర్శనమిచ్చిన మృణాల్ ఠాకూర్ నెట్టింటిని షేక్ చేసింది. సౌత్, నార్త్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడంతో సోషల్ మీడియాలతో హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ దుమారం రేపుతోంది. నెటిజన్లు సైతం ఈ కుర్రభామను ఎంకరేజ్ చేస్తున్నారు. 
 


తాజాగా మృణాల్ ఆరెంజ్ డ్రెస్ లో అదిరగొట్టింది. స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ అందాలతో మతులు పోగొట్టింది. మరోవైపు యంగ్ బ్యూటీ మత్తు చూపులతో మైమరిపించింది. క్యూట్ స్మైల్ తో కుర్ర గుండెల్ని దోచేసింది. ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

మరోవైపు నెటిజన్లు కూడా క్రేజీ హీరోయిన్ ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కొందరు బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతుంటుంటే.. అందాలతో మత్తెక్కించేస్తున్నావ్ అంటూ మరికొందరు కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇలా వరుసగా తన ఫొటోషూట్లతో ఆకట్టుకుంటూనే ఉంది.
 

'సీతారామం'తో మంచి హిట్ అందుకున్న మృణాల్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. దీంతో టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు అందుతున్నాయి. రీసెంట్ గా సమంతతో చాట్ చేయడం.. సినిమా చేయాలని ఉందంటూ ఓపెన్ కామెంట్ చేయడం వంటివి.. మృణాల్ కు టాలీవుడ్ పై ఆసక్తిని చూపిస్తున్నాయి. 
 

ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన అలరించబోతోంది. Nani30లో హీరోయిన్ ఛాన్స్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు రామ్ చరణ్ సరసన కూడా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్ కు కూడా మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
 

Latest Videos

click me!