స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తున్న మౌనీ రాయ్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘నాగినీ’ బ్యూటీ మెరుపులు

First Published | May 23, 2023, 6:05 PM IST

‘బ్రహ్మస్త్ర’ నటి మౌనీ రాయ్ తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

‘నాగినీ’ ఫేమ్ మౌనీ రామ్ (Mouni Roy) ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో పాల్గొంది. 76వ సారి ఈవెంట్ కేన్స్ లో కొనసాగుతోంది. మే16న ప్రారంభమైన వేడుకలు మే 27 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఫెస్టివల్ కు బాలీవుడ్ తారలు హాజరైన విషయం తెలిసిందే.
 

మౌనీరాయ్ తొలిసారిగా ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. నిన్న బ్యూటీఫుల్ లుక్ లో రెడ్ కార్పెట్ పై నడిచింది. తన అందంతో ఆకట్టుకుంది. మరుసటి రోజు కూడా నాగినీ బ్యూటీ ఫెస్టివల్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది.
 


తాజాగా ఆ ఫొటోలను కూడా మౌనీ రామ్ అభిమానులతో పంచుకుంది. క్రేజీగా ఫొటోషూట్ చేసి పిక్స్ ను షేర్ చేసుకుంది. లేటెస్ట్ లుక్ లో మౌనీరాయ్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే డ్రెస్ లో అందాలనూ ప్రదర్శించింది. యంగ్ బ్యూటీ మెరుపులతో అట్రాక్ట్ చేసింది.
 

లేటెస్ట్ పిక్స్ లో మౌనీ రాయ్ గ్లామర్ మెరుపులనూ మెరిపించింది. స్లీవ్ లెస్ అండ్ స్ట్రిప్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలను ఆరబోసింది. గోల్డ్ కలర్ లెహంగాలో తనదైన స్టిల్స్ తో అదరగొట్టింది. మత్తు పోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫొటోలను ఫ్యాన్స్ లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక మౌనీరాయ్ రీసెంట్ గా వేకేషన్ లోనూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి ఫొటోలను కూడా పంచుకుంది. సోషల్ మీడియాలో ఇలా యాక్టివ్ గా కనిపిస్తూ రోజురోజుకు మరింతగా క్రేజ్ పెంచుకుంటోంది. 
 

ఇదిలా ఉంటే మౌనీరాయ్ సినిమాలతోనూ బిజీగా ఉంటున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. చివరిగా ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ చిత్రంలో నటిస్తోంది. హిందీలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది.
 

Latest Videos

click me!