వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేస్తూ.. స్లీవ్ లెస్ టాప్ లో మౌనీ రాయ్ మెరుపులు.. ఈసారి మాత్రం..

First Published | Jun 22, 2023, 8:16 PM IST

నటి మౌనీరాయ్ ఎప్పుడూ నేచర్ కు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. సమయం దొరికితే వెకేషన్లు, టూర్లకు వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. తాజాగా వాటర్ ఫాల్స్  వద్ద ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
 

‘నాగినీ’ సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన పెర్ఫామెన్స్ తో సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది. 
 

హిందీ చిత్రాల్లోనే కాకుండా సౌత్ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 హిందీ వెర్షన్ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత చాలా చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ ను అలరించింది.
 


ఇదిలా ఉంటే.. మౌనీ రాయ్ గతేడాది వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తోంది. మరోవైపు మ్యారీడ్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. సమయం దొరికినప్పుడల్లా భర్తతో కలిసి టూర్లకు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. 
 

రెండ్రోజుల నుంచి వాతావరణం చల్లబడుతుండటం.. అక్కడక్కడా వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో మౌనీ రాయ్ బ్యూటీఫుల్ లోకేషన్ లోని వాటర్ ఫాల్స్ ను విజిట్ చేసింది. ఎంతైన కొండలపైకి చేరి ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోల్లో మౌనీ రాయ్ వైల్డ్ లైఫ్ వేర్స్  ధరించింది. స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు స్లీవ్ లెస్ టాప్ లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. గతంలో వెకేషన్లకు వెళ్లి అందాల రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈసారి మాత్రం నిండు దుస్తులతో దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

మౌనీ రాయ్ కేరీర్ విషయానికొస్తే అలా అలా సాగుతోంది. తనకొచ్చిన అవకాశాలను మాత్రం సరిగా వినియోగించుకుంటోంది. చివరిగా ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో అలరించింది. ప్రస్తుతం ’వర్జిన్ ట్రీ’గా హిందీలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో నటిస్తోంది. మరోవైపు డాన్స్ బంగ్లా డాన్స్  సీజీన్ 12కి జడ్జీగా వ్యవహరిస్తోంది.
 

Latest Videos

click me!