Manchu Lakshmi: మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదుగా... ఫోర్టీ ప్లస్ లో నాటీ ఫోజులతో హీటెక్కిస్తున్న స్టార్ కిడ్!

Published : Jan 02, 2023, 07:26 AM ISTUpdated : Jan 02, 2023, 11:01 AM IST

మంచు లక్ష్మి ఆ విషయంలో అసలు తగ్గేదేలే అంటుంది. ఫోర్టీ ప్లస్ లో నాటీ లుక్స్ తో చంపేస్తుంది. హాట్ ట్రెండీ వేర్ ధరించిన మంచు లక్ష్మి న్యూ ఇయర్ గ్లామర్ ట్రీట్ అదిరింది.   

PREV
19
Manchu Lakshmi: మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదుగా... ఫోర్టీ ప్లస్ లో నాటీ ఫోజులతో హీటెక్కిస్తున్న స్టార్ కిడ్!
Manchu Lakshami

న్యూ ఇయర్(New Year 2023) వేడుకల కోసం మంచు లక్ష్మి ప్రత్యేకంగా తయారయ్యారు. డిజైనర్ వేర్ ధరించి సరికొత్తగా మెరిశారు. ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటో షూట్ షేర్ చేసిన మంచు లక్ష్మి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా... ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

29


అమెరికాలో ఏళ్ల తరబడి ఉన్న మంచు లక్ష్మి ఆలోచన పాశ్చాత్యులను తలపిస్తాయి. ఆమె  హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. 

 

39

 ఇక మంచు లక్ష్మి ఏం చేసిన ట్రోల్ చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అయితే మంచు లక్ష్మి ఈ విమర్శలను, సెటైర్స్ ని అసలు పట్టించుకోరు. అవన్నీ పనీపాటా లేని వారు చేసే కామెంట్స్ అంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే జీవితంలో ఏమీ చేయలేమని తీసి పారేస్తారు. 
 

49

కాగా మంచు ఫ్యామిలీలో విబేధాలు అంటూ ఇటీవల ఒక న్యూస్ తెరపైకి వచ్చింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని, అందుకే ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ కథలు వెలువడ్డాయి. ఈ వార్తలను మంచు లక్ష్మి ఖండించారు.  

59
Manchu Lakshami


మంచు లక్ష్మి(Manchu Lakshmi) కెరీర్ అమెరికాలో మొదలైంది. ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాలలో నటించిన ఆమె టెలివిజన్ హోస్ట్ గా చేశారు. పలు పాప్యులర్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంచు లక్ష్మి ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఆ భాషలో చాలా పర్ఫెక్ట్. 
 

69


ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంగ్లీష్ తో కూడిన తెలుగు ట్రోల్స్ కి గురైంది. మంచు లక్ష్మి తెలుగు మాటలపై అనేక మీమ్ వీడియోలు ఉన్నాయి. ఇక మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సొంత డబ్బా కొట్టుకుంటారనే పేరున్న ఈ ఫ్యామిలీపై మీమ్ వీడియోలు చేస్తూ బ్రతికేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. 

79


ఇక మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్. అక్టోబర్ లో విడుదలైన ఈ మలయాళ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వైశక్ తెరకెక్కించగా మంచు లక్ష్మి ఒక కీలక రోల్ చేశారు. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకింది. ఆమె లెగ్ పవర్ కి మోహన్ లాల్ కెరీర్లో వరస్ట్ మూవీగా మాన్స్టర్ నిలిచింది. 
 

89


ఇంత దారుణమైన సినిమా మోహన్ లాల్ నుండి ఆశించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మోహన్ లాల్ స్క్రిప్ట్ సెలక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతి సినిమా ఒప్పుకొని చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. మాన్స్టర్ అంతటి దారుణ ఫలితాన్ని అందుకుంది. 

99


మాన్స్టర్ ఫలితం పక్కన పెడితే ఈ మూవీలో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ అయ్యింది. మాన్స్టర్ మూవీలో ఆమె లెస్బియన్ రోల్ చేశారు. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాల్లో మంచు లక్ష్మి నటించారు. ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం జరిగింది.
 

click me!

Recommended Stories