పింక్ డ్రెస్ లో రవితేజ హీరోయిన్ గ్లామర్ మెరుపులు.. కురులను సర్దుకుంటూ అట్రాక్ట్ చేస్తున్న మాళవిక శర్మ..

First Published | May 20, 2023, 1:22 PM IST

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ (Malvika Sharma)  క్యూట్ పిక్స్ షేర్ చేసి కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. మిర్రర్ ముందు కురులను సర్దుకుంటూ కవ్వింపు చర్యలతో ఆకర్షిస్తోంది.
 

నార్త్ బ్యూటీ మాళవిక శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మాస్ మహారాజా రవితేజకు జోడిగా ’నేల టికెట్‘ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఈ బ్యూటీకి తొలిచిత్రం. ఫస్ట్ మూవీతో తన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ చిత్రం ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది.
 

ఆ తర్వాత మాళవిక ’రెడ్‘, తమిళంలో ’కాఫీ విత్ కాదల్‘ చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. రీసెంట్ గా హిందీలో భారీ స్థాయిలో రూపుదిద్దుకొని విడుదలైన ’కిసి కా బాయ్ కిసి కి జాన్‘లోనూ కీలక పాత్రలో మెరిసింది. 


మొత్తంగా నాలుగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈమె స్టార్ స్టేటస్ దక్కించుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందనేది అర్థం అవుతోంది. ఈక్రమంలో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 
 

ఈ సందర్భంగా మాళవిక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమాల విషయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. మరింత క్రేజ్ దక్కించుకునేందుకు క్రేజీ పోస్టులు పెడుతోంది. గ్లామర్ మెరుపులూ మెరిపిస్తోంది.
 

తాజాగా మాళవిక పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. క్యాజువల్ గానూ మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. హెయిర్ డ్రైయర్ తో కురులను ఎండబెడుతూ అద్దం ముందుకు క్యూట్ గా ఫోజులిచ్చింది.  ఆ ఫొటోలను షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

పింక్ డ్రెస్ లో మాళవిక క్యూట్ లుక్ ను సొంతం చేసుకుంది. క్లీవేజ్ షోతోనూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. గ్లామర్ షోకు దూరంగా ఉండే మాళవిక ఇలా క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

Latest Videos

click me!