గౌన్ లాంటి డ్రెస్ లో మలయాళీ భామ కవ్వింపు చర్యలు.. మత్తెక్కించే పోజులతో మాళవికా మోహనన్ రచ్చ..

First Published | May 8, 2023, 4:45 PM IST

మలయాళీ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan)  స్టన్నింగ్ లుక్ లో చూపుతిప్పుకోకుండా చేసింది. అదిరిపోయే డ్రెస్ లో అందాలను ప్రదర్శించేలా ఫోజులిచ్చింది. తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఆ పిక్స్ వైరల్ గా మారాయి.

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్  ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటూ కేరీర్ లో దూసుకెళ్తోంది. 
 

అటు హిందీ చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ చూపు ప్రస్తుతం టాలీవుడ్ పై పడింది. మలయాళం నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్లు మారిన విషయం తెలిసిందే.  ఈక్రమంలో మాళవికా కూడా తన వంతు ప్రయత్నాలు  చేస్తోంది.
 


ఇక మాళవికా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.  ఈక్రమంలోనే మాళవికా తన  బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ రచ్చ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

లేటెస్ట్ పిక్స్ లో మాళవికా బ్లాక్ కలర్ గౌన్ లాంటి డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ అందాలతో షోల్డర్ గ్లామర్ చూపించింది. మరోవైపు అదిరిపోయేలా ఫోజులిచ్చి కుర్రగుండెల్ని  కొల్లగొట్టింది. మత్తు చూపులతో మైకం తెప్పించింది. మాళవికా కవ్వింపు చర్యలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 

ఇక ఎల్లప్పుడూ చాలా ఫిట్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు మాళవికా మోహనన్. ఇందుకోసం డైలీ వర్కౌట్స్ చేస్తూ జీరో ఫ్యాట్ తో ఫిట్ గా తయారవుతోంది. ఈ క్రమంలోనే ఇలా అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు  కూడా మెరిపిస్తోంది. ప్రస్తుతం ఈపిక్స్ వైరల్ గా మారాయి.

టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని ఎప్పుడో ఓపెన్ గానే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas సరసన  నటిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో చియాన్ విక్రమ్ కు జోడీగా ‘తంగలన్’లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’లో నటిస్తోంది.

Latest Videos

click me!