పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు.? రూమర్లపై స్పందించిన నటి లావణ్య త్రిపాఠి..

First Published | Mar 4, 2023, 11:49 AM IST

నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించారు.  ఈ సందర్బంగా తన పెళ్లి అప్డేట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

యంగ్ హీరోయిన్, నార్త్ బ్యూటీ  లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతమూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. 
 

సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లోనూ మెరుస్తోంది.  తాజాగా తను నటించిన  ‘పులి మేక’ (Puli Meka) వెబ్ సిరీస్ గతనెల ఫిబ్రవరి 24 నుంచి జీ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సీరిస్ లో లావణ్య పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంటున్నారు. 


అయితే, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత విషయాల పైనా స్పందించారు. కొద్దిరోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు తాజా  ఇంటర్వ్యూలో చెక్ పెట్టింది. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించిన వారికి ఆసక్తికరంగా బదులిచ్చింది. 
 

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘అందరూ నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు?. టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. పెళ్లి విషయంలో మా తల్లిదండ్రుల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు నేను లక్కీ. ఇప్పుడు నాకు పెళ్లి  గురించి ఆలోచనే లేదు. కేరీర్ పైనే ఫోకస్ అంతా పెట్టాను’ అంటూ బదులిచ్చింది.
 

మరోవైపు.. పెళ్లిపై తనకు నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చింది. మన జీవితంలోకి కరెక్ట్ పర్సన్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని, అప్పుడే లైఫ్ అందంగా ఉంటుందన్నారు. మ్యారేజ్ కల్చర్ సరైన సమయంలో జరగాలని భావిస్తున్నాను. అందుకే పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి కలలు డ్రీమ్స్ లేవంటూ’ ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చింది.

‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. గతేడాది ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రంతో ఆకట్టుకుంటంది. వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం తమిళంలో ‘తానల్’లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!