‘ఆ న్యూడ్ ఫొటోలు నావికాదు.. దాం తర్వాతే ఇలా చేశారు’.. స్పందించిన నటి జయవాణి

First Published | Jun 22, 2023, 1:22 PM IST

తెలుగు నటి జవాణికి సోషల్ మీడియాలో చేధు అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించినవి అంటూ కొన్ని న్యూడ్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దానిపై నటి స్వయంగా స్పందించింది.
 

నటి జయవాణి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయా సినిమాల్లో మెప్పించారు. ముఖ్యంగా రాజమౌళి - మాస్ మాహారాజా కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో ఈమె అందిరీకి గుర్తుండి పోయింది. ‘ఓరేయ్ సత్తిగా..’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
 

గుంటూరుకు చెందిన జవాణికి ఈ చిత్రం తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ కొన్ని ఆఫర్లు అందుకుంది. ఇటీవల మాత్రం ఇమె ఇండస్ట్రీకి కాస్తా దూరంగా ఉంటోంది. త్వరలో మరో చిత్రంలో ప్రేక్షకులను అలరించబోతోందంటూ టాక్ వచ్చింది.
 


‘శూర్పణఖ’ అనే చిత్రంలో నటిస్తుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. ఈ చిత్రంలోంచి అంటూ కొన్ని న్యూడ్ ఫొటోలు, వీడియోలు కూడా వచ్చాయి. అది కూడా జయవాణి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ కావడంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. 

ప్రస్తుతం  ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం జయవాణికి తెలియడంతో వెంటనే స్పందించారు. ఆమె న్యూడ్ ఫొటోలపై సీరియస్ అయ్యారు. ఆ ఫొటోలు తనవి కావని క్లారిటీ ఇచ్చారు. అసలు తనకు ట్విట్టర్ అకౌంటే లేదంటూ తెలిపింది. తన పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. 
 

అలాగే తను Soorpanakha అనే సిరీస్ చేస్తున్నారా? అని అడిగారని.. అందుకు లేదని బదులిచ్చారని అన్నారు. ఆ తర్వాతే ఇలాంటి పోస్టులు పెట్టారని అభిప్రాయపడ్డారు. ఆ అకౌంట్ నాది కాదు. ఎవరూ నమ్మొద్దు అంటూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికైనా తనలానే ట్వీటర్ లో పోస్టులు పెడుతున్న వారు ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇలా ఇబ్బంది పెడుతున్న వారిపై సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి జయవాణి స్పందించడంతో ఆ పోస్టులు ఫేక్ అని తేలిపోయింది.
 

Latest Videos

click me!