అద్దం ముందు.. టైట్ ఫిట్ లో జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన.. బాలీవుడ్ భామ స్టన్నింగ్ పోజులకు మైండ్ బ్లాకే

First Published | Mar 25, 2023, 2:51 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా స్టన్నింగ్ పోజులతో అదరగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. అద్దం ముందుకు అందాల ప్రదర్శనతో నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది.
 

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  మొత్తానికి టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయ్యింది. ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) సరసనే నటించబోతోంది. తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

రీసెంట్ గా ఎన్టీఆర్30 పూజా కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కూడా ట్రెడిషనల్ లుక్ లో హాజరై అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి ఎన్టీఆర్ సరసన నటించబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. వీరి కాంబో అలనాటి ఎన్టీఆర్, శ్రీదేవి లా ఉండబోతుందని భావిస్తున్నారు. 


మరోవైపు జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ నెట్టింట  సందడి చేస్తోంది. ఆయా ఈవెంట్లకు, పోగ్రామ్స్ కు హాజరవుతున్న ఈ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ లుక్  ను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. 
 

తాజాగా జాన్వీ కపూర్ పంచుకున్న ఫొటోల్లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. టైట్ ఫిట్ లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిలువుద్దం ముందు అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును మైమరిపించింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులూ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. 

గ్లామర్ షోలో అన్నీ హద్దులను చెరిపేసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా చేస్తోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సైతం ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో క్షణాల్లో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరికొద్దిరోజుల్లోనే ‘ఎన్టీఆర్30’ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్నిపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతుండటంతో జాన్వీ కేరీర్ కూడా మరో స్థాయికి వెళ్లనుందని భావిస్తున్నారు. 
 

Latest Videos

click me!