NTR30 షూటింగ్.. హైదరాబాద్ కు చేరుకున్న జాన్వీ కపూర్.. వైరల్ గా మారిన పిక్స్

First Published | Apr 17, 2023, 7:20 PM IST

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ‘ఎన్టీఆర్30’ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.  తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ మొత్తానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా జాన్వీ కపూర్ కూడా షూటింగ్ కు సిద్ధమయ్యారు. 
 

నిన్ననే జాన్వీకపూర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఎయిర్ పోర్టులో ఆమె సిటీకి చేరుకున్నట్టుగా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పైగా ‘ఎన్టీఆర్30’రెండో షెడ్యూల్ కూడా ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కూడా జాయిన్ అవుతుందని తెలుస్తోంది.
 


ఈ సందర్భంగా జాన్వీ కపూర్ NTR30 సెట్స్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈరోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయినట్టు సమాచారం. ఇంతకంటే ముందు ఫస్ట్ షెడ్యూల్ ను శంషాబాద్ లోని భారీ షిప్ సెట్ లో నిర్వహించారు. దాదాపు 10 రోజులకు పైగా షూటింగ్ కొనసాగించారు. 
 

‘ఎన్టీఆర్30’ కోసం కొరటాల శివ ఏకంగా హాలీవుడ్ టెక్నీషన్లను భాగస్వామ్యులను చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ ను,  అద్భుతమైన VFX కోసం హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ బ్రాడ్ మిన్నిచ్ ను రంగంలోకి దింపారు. దీంతో సినిమా అవుట్ పుట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. 
 

ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఓ ఐలాండ్ లో భయం అంటే తెలియని మనుషులకు భయం పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 05న థియేటర్లలో రిలీజ్ కానుంది. 
 

జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. లెహంగా వోణీలో జాన్వీ ఆకట్టుకుంది. NTR30 ప్రపంచానికి చక్కగా సరిపోయిందనిపించింది. ఇక మే20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో స్పెషల్ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మున్ముందు వచ్చే అప్డేట్స్ పై ఆసక్తి పెరిగింది.

Latest Videos

click me!