రెడ్ డ్రెస్ లో ఐశ్వర్య మీనన్ మెరుపులు.. నిఖిల్ ‘స్పై’ బ్యూటీ ఫోజులకు కుర్రాళ్లు బేజారే..

First Published | May 20, 2023, 5:55 PM IST

తమిళ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) తర్వలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. నిఖిల్ సరసన కోలీవుడ్ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది.
 

కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తమిళ చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ పర్లేదనే చెప్పాలి. 
 

ఇక తర్వలో ఐశ్వర్య మీనన్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పదేళ్ల కింద సిద్దార్థ్ - అమలా పాల్ నటించిన ’లవ్ ఫెల్యూర్‘ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. మళ్లీ ఇప్పుడు అలరించబోతోంది.
 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikil Siddhartha)  లేటెస్ట్ ఫిల్మ్ Spy. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన రహస్యాలను వెల్లడించే నేథప్యంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మూవీలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ అలరించబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది.
 

పాన్ ఇండియా స్థాయిలో ‘స్పై’ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోనుందనే చెప్పాలి. అయితే ఐశ్వర్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. తన సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు.
 

ఈ క్రమంలో ‘స్పై’ మూవీని ప్రమోట్ చేస్తూ యంగ్ బ్యూటీ క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మీనన్ అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది. అందచందాలను ప్రదర్శిస్తూ ఫఒటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

మెరూన్ కలర్ క్రాప్డ్ టాప్, ట్రౌజర్ లో ఐశ్వర్య మీనన్ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. అన్నీ యాంగిల్లో స్టిల్స్ ఇస్తూ కుర్రగుండెల్ని దోచేసింది. ఈ ముద్దుగుమ్మ మత్తెక్కించే ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.  లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

ఐశ్వర్య నెట్టింట ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఎప్పటికప్పుడు నయా లుక్స్ తో కట్టిపడేస్తుంటుంది. ముఖ్యంగా గ్లామర్ మెరుపులతోనూ ఐశ్వర్య మైమరిపిస్తుంటుంది. కుర్ర భామ గ్లామర్ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది.
 

తమిళ చిత్రాలతోనే కాకుండా ఐశ్వర్య మీనన్ కన్నడ, మలయాళంలో ఒకటి రెండు సినిమాల్లో మెరిశారు. అందం, నటన పరంగా అక్కడ పర్లేదనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతోందో చూడాలి. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న తెలుగు పరిశ్రమలో మున్ముందు వెలుగుతుందా అన్నది చూడాలి.

Latest Videos

click me!