పారిస్ లో యాపిల్ బ్యూటీ.. స్లిమ్ గా మారి.. కలర్ ఫుల్ డ్రెస్ లో హన్సిక కిర్రాక్ ఫోజులు..

First Published | Jul 11, 2023, 2:31 PM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పారిస్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ (Hansika Motwani)  ప్రస్తుతం చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి పీటలు ఎక్కినా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. మునుపటి కంటే మరిన్ని చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. 
 

గతేడాది డిసెంబర్ 4న తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ కతురియాను హన్సిక పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ లోని మండోట ఫోర్ట్ లో సంప్రదాయ పద్ధతుల్లోనే వీరి వివాహ వేడుక అంగరంగవైభంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత సమయం ఉన్నప్పుడల్లా వెకేషన్లకు వెళ్తూ ఉంది.
 


ఇక హన్సిక గతంలో కంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. స్లిమ్ గా మారిన యాపిల్ బ్యూటీ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట  దర్శనమిస్తోంది. నాజుకూ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.
 

ప్రస్తుతం హన్సిక ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ సిటీ అందాలను ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా కలర్ ఫుల్ డ్రెస్ లో హన్సిక ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. కిల్లింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది.
 

స్లీవ్ లాంగ్ ఫ్రాక్ లో హన్సిక మరింత యంగ్ గా కనిపిస్తోంది. మెరిసిపోతున్న స్కిన్ టోన్, స్టన్నింగ్ సిట్టింగ్ ఫోజులతో అట్రాక్ట్ చేసింది. క్యూట్ స్టిల్స్, బ్యూటీఫుల్ స్మైల్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. వారూ లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

కెరీర్ విషయానికొస్తే హన్సిక ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ‘పార్ట్నర్’, ‘రౌడీ బేబీ’; ‘గార్డియన్’, ‘గాంధారి’, ‘మ్యాన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాయి. 

Latest Videos

click me!