యాపిల్ బ్యూటీ హన్సిక మెత్వానీ పెళ్లి తర్వాత మరింతగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. గతంలో కాస్తా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం స్లిమ్ గా మారి పరువాల ప్రదర్శన చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ రచ్చరచ్చ చేస్తోంది.
రీసెంట్ గా వేకేషన్ కు వెళ్లిన హన్సికా మోత్వాని బోటులో పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చి మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగానే తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చి మైండ్ బ్లాక్ చేస్తోంది.
లేటెస్ట్ గా హన్సికా పంచుకున్న పిక్స్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. డార్క్ గ్రీన్ బ్లేజర్, పొట్టి షార్ట్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది. ఈనయా లుక్ తో ఆకట్టుకుంది. మరోవైపు అందాల విందు కూడా చేసింది. రెచ్చిపోయి మరీ ఫొటోలకు ఫోజులిచ్చింది.
హన్సికా పొట్టి డ్రెస్ లో థండర్ థైస్ ను చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో కుర్ర గుండెల్లోగంటలు మోగించింది. మరోవైపు టెంప్టింగ్ గా ఫోజులిస్తూ హీట్ పెంచేసింది. యాపిల్ బ్యూటీ కిల్లింగ్ పోజులకు యువత చిత్తైపోతోంది.
2022 డిసెంబర్ 4న తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ ఖతురియాను హన్సిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పలు టూర్లు, వేకేషన్లకు వెళ్తూ యాపిల్ బ్యూటీ నానా రచ్చ చేస్తోంది. మరోవైపు ఆయా ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తోంది.
తాజాగా రిలయన్స్ రిటైల్ మర్చండైజింగ్ ఈవెంట్ కోసం ఇలా ట్రెండీ లుక్ లో ఫొటోషూట్ చేసింది. హన్సిక లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం హన్సిక తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.