టర్కీలో హన్సికా సందడి.. పొట్టి నెక్కరులో థైస్ షోతో యాపిల్ బ్యూటీ రచ్చ..

First Published | Aug 14, 2023, 1:05 PM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ ప్రస్తుతం వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. విదేశాల్లోని బ్యూటీఫుల్ లోకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. తాజాగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందిన స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన కెరీర్ ను తెలుగు చిత్రాలతోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. సౌత్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. 
 

అసలు హన్సికా కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ప్రారంభమైంది. ‘హవా, కోయి మిల్ గయా’ వంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది.  ‘దేశముదురు’తో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అటు నటన పరంగా, గ్లామర్ పరంగా, డాన్స్ లోనూ నూటినూరు శాతం మార్కులు దక్కించుకుంది. 
 


తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్స్ సరసన వరుస చిత్రాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 

ఈ క్రమంలో గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాల్లో వాలిపోతోంది. గతేడాది చివర్లో తన స్నేహితుడు సోహెల్ కతూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భర్తతో కలిసి సమయం ఉన్నప్పుడ్లలా వెకేషన్లు, టూర్లకు వెళ్తూ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 
 

ప్రస్తుతం యాపిల్ బ్యూటీ టర్కీలో ఉంది.  అక్కడి బ్యూటీఫుల్ లోకేషన్లను, పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ సందడి చేస్తోంది.  నగరంలోని అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది. మరింత జోష్ ను నింపుకుంటోంది. 

అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోందీ ముద్దుగుమ్మ. లేటెస్ట్ ఫొటోస్ లో పొట్టి నెక్కర్ ధరించి, వైట్ టీషర్ట్, తలకు స్కార్ఫ్ చుట్టుకొని గాగూల్స్ పెట్టుకొని స్టైలిష్ గా  మెరిసింది. మరోవైపు థైస్ షోతో మతులు పోగొట్టింది. 
 

గతంలో లావుగా ఉన్న హన్సికా.. ప్రస్తుతం స్లిమ్ గా మారడంతో మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఎలాంటి అవుట్ ఫిట్ ధరించి స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ హన్సిక ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం హన్సిక నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో ఐదారు చిత్రాల్లోనూ నటిస్తోంది. తమిళంలో ‘పార్ట్నర్’, తెలుగులో ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ ‘మ్యాన్’ వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!