అరుదైన వ్యాధి.. ‘ఐదేళ్ల కంటే ఎక్కువగా బతకనన్నారు’.. నటి గాయత్రీ గుప్తా షాకింగ్ కామెంట్స్!

First Published | Aug 21, 2023, 8:11 PM IST

నటి, యాంకర్ గాయత్రీ గుప్తా (Gayathri Gupta)  తన హెల్త్ పై తాజాగా షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దాన్నుంచి బయట పడేందుకు ఏం చేస్తుందో కూడా చెప్పుకొచ్చింది. 
 

యాంకర్ గా, ఫార్ట్ ఫిలింస్, పలు మూవీతోస్ గాయత్రీ గుప్తా కాస్తా గుర్తింపు దక్కించుకుంది. ముక్కు సూటిగా మాట్లాడే తత్వంతో మరింతగా పాపులారిటీని దక్కించుకుంది. లాక్ డౌన్ కు ముందు ఈమె ఇంటర్వ్యూల్లో తరుచుగా మెరుస్తుండేది. 
 

ప్రస్తుతం కొద్దికాలంగా గాయత్రీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పెద్దగా సందడి చేయడం లేదు. ఇందుకు ఓ కారణంగా ఉంది. అది ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నదంట. ఈ విషయాన్ని గాయత్రీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 


గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి వెళ్తానంటే మా  ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో 25 ఏళ్లలో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. అప్పటికే నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది. అసలు ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. 
 

ఈ వ్యాధి కారణంగా పదేళ్లు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని తెలుసుకున్నాను. గత ఆరు నెలల కిందనే ఈ విషయం కూడా నాకు తెలిసింది. అంతకు ముందు చాలా మంది డాక్టర్లను సంప్రదించినప్పుడు ఐదేళ్ల కంటే ఎక్కువ బకనని చెప్పారు.  మూడేళ్ల కిందనే చెప్పారు. 
 

చిన్నప్పటి నుంచే రాత్రుళ్లు సరిగా నిద్రలేకపోయేది. అందుకు కారణం డిప్రెషన్. నెలకు రెండు సార్లు బయాలాజికల్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే కనీసం కదలడం కూడా కష్టమయ్యేది. పదేళ్ల నుంచి పేయిన్ కిల్లర్స్ వాడుతున్నాను. వీటితో డాక్టర్లు నేను బతకడం కష్టమని చెప్పారు. బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేంది. దానికంటే చావే నయం అనుకున్నాననంటూ చెప్పుకొచ్చింది.  
 

కానీ, ఇప్పుడు ఆ బాధ నుంచి బయటికి వస్తున్నట్టు తెలుస్తోంది. సైకాలజీ థెరపీ ద్వారా వ్యాధి నివారణ చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. సమయానికి పడుకోవడం.. యోగా చేయడంతో కాస్తా నయం అవుతుందని చెప్పింది. ప్రస్తుతం ఈమె మాట్లాలు వైరల్ గా మారాయి. ఇక గాయత్రీ గుప్తా ‘ఐస్ క్రీమ్2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ తదితర చిత్రాల్లో మెరిసింది. యాంకర్ గానూ ఆకట్టుకుంది. క్యాస్టింగ్ కౌచ్, బిగ్ బాస్ టీమ్ పై పలు ఆరోపణల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
 

Latest Videos

click me!