‘జాతిరత్నాలు’ చిట్టి చీరకడితే ఇంత అందంగా ఉంటుందా.? శారీలో మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా..

First Published | Mar 10, 2023, 6:28 PM IST

యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను బాగా  ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మైమరిపిస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసిపోతోంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా అవసరం లేదు.  అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలిచిత్రంతోనే హిట్ అందుకుంది.  
 

ప్రస్తుతం ఫరియా  ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ, తన  ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.  
 


 గ్లామర్ షోకు కాస్తా దూరంగా ఉండే ఇటీవల ఫరియా ఇటీవల డోస్ పెంచుతోంది. అందాల విందుకు తెరతీస్తూ నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో పరువాలను ప్రదర్శిస్తూ నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా ఫరియా అబ్దుల్లా చీరకట్టులో దర్శనమిచ్చింది. ఈ పొగుడుకాళ్ల సుందరి శారీ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్, లెహంగా వోణీలో మెరిసే ఈ ముద్దుగుమ్మ చీరలో కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.  
 

మత్తెక్కించే  కళ్లతో అమాయకంగా చూస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది ఫరియా. రింగురింగుల కురులతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరలో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ పోజులతో కట్టిపడేసింది. పిక్స్ ను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

జాతిరత్నాలు తర్వాత ఫరియా వరుస ఆఫర్లను అందుకుంటోంది. చివరిగా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’తో అలరించింది. ప్రస్తుతం మాస్ మహారాజా ‘రావణసుర’లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళంలోనూ ఓ  చిత్రంలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!