పూలపూల చీరకట్టిన ఫరియా.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరుపులు.. చూపుల్తోనే మతులు పోగొడుతున్న ‘జాతిరత్నాలు’ చిట్టి..

First Published | Mar 25, 2023, 4:30 PM IST

‘జాతిరత్నాలు’తో మంచి ఫేమ్ దక్కించుకున్న యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రవితేజ సినిమాతో అలరించబోతుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

యూత్ ను బాగా ఆకట్టుకున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం ‘జాతిరత్నాలు’తో యంగ్  అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియాఅబ్దుల్లా (Faria Abdullah)  మంచి ఫేమ్ దక్కించుకుంది. తొలిచిత్రంతోనే హిట్ ను సొంతం చేసుకుంది. 
 

చిట్టి పాత్రలో తన నటనతో ఫరియా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మరోవైపు తన అందంతోనూ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో అనుష్క తర్వాత మళ్లీ అంత హైట్ ఉన్న హీరోయిన్ గానూ ఫరియా క్రేజ్ దక్కించుకున్నారు. 
 


ప్రస్తుతం కేరీర్ పైనే ఫోకస్ పెట్టిన ఫరియా.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నా భారీచిత్రాల్లో ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నెట్టింట తెగ సందడి చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. 
 

గతంలో గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఈ ముద్దుగుమ్మ ఇటీవల అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు. అందాలను వడ్డిస్తూ నెట్టింట తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఈక్రమంలో తాజాగా చీరకట్టులో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 

పూలపూల చీరకట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. షోల్డర్ అందాలతో, ఆకర్షించే రూపసౌందర్యంతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొట్టింది. శారీలో హోయలు పోతూ మత్తెక్కించేలా పోజులిచ్చింది.మరోవైపు ఓర చూపుతో యువతను చిత్తు చేసింది.
 

ఫరియా పంచుకున్న ఈ ఫొటోలు నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. దీంతో లైక్స్, కామెంట్లతో ఆ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఫరియా అందాన్ని కామెంట్ల రూపంలో  పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ప్రస్తుతం ఫరియా నటించిన ‘రావణసుర’ Ravanasura చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఫరియా కూడా ఇలా నెట్టింట ఫొటోషూట్లతో సందడి చేస్తోంది. 
 

యంగ్ బ్యూటీ ఫరియాకు జాతిరత్నాలు చిత్రంతోమంచి హిట్ పడింది. ఆ తర్వాత అలాంటి సక్సెస్ అందడం కష్టంగానే మారింది. దీంతో ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. చివరిగా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’తో అలరించింది. ప్రస్తుతం ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!