స్టన్నర్.. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో మెంటల్ ఎక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ బ్యూటీ.. దిశా పటానీ కిర్రాక్ పోజులు

First Published | Jun 30, 2023, 5:23 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దిశా పటానీ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ బాంబ్ లా పేలింది. ప్రస్తుతం తన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది.  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిచింది.
 

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన్ ‘ఎంఎస్ ధోనీ’తో మాత్రం దిశా పటానీకి మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తోంది.
 


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ది నైట్ మేనేజర్ 2’ సిరీస్ ప్రమోషన్స్ లో ఉంది. నిన్నటి నుంచి ప్రముఖ హాట్ స్టార్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నిన్న ముంబైలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో దిశా పటానీ కూడా పాల్గొంది.
 

ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి  అందరి మతులు పోగొట్టింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. పలుచటి స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. టైట్ జీన్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 
 

గ్లామర్ షోలో దిశా పటానీ ఎప్పుడో హద్దులు దాటిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి ఈవెంట్ లో దిశా నయా లుక్ మాత్రం ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. దిశా లుక్ కు నటి మౌనీరాయ్ సైతం ఫిదా అయ్యింది. ‘స్టన్నర్’ అంటూ కామెంట్ సైతం చేసింది. 
 

ఇక దిశా ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనే సందడి చేయబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’లో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా టీమ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తమిళంలో సూర్య సరసన ‘కంగువా’లోనూ నటిస్తోంది. హిందీలో ‘యోదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Latest Videos

click me!