నిగనిగలాడే పెదవులు, మత్తెక్కించే సొగసు.. గ్లామర్ మెరుపులతో రచ్చ చేస్తున్న భూమికా చావ్లా..

First Published | Apr 23, 2023, 10:55 AM IST

సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika Chawla) గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కుర్ర హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ తో అదరగొట్టింది. 
 

కొన్నాళ్ల పాటు టాలీవుడ్ ను ఊపూపింది స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా. బడా హీరోల సరసన నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలిచింది. గ్లామర్ రోల్స్ లోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

ప్రస్తుతం  సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ సీనియర్ భామ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. కీలక  పాత్రలు పోషిస్తూ ఆడియెన్స ను అలరిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. 


అభిమానులకు గుర్తుండిపోయే చిత్రాల్లో నటించిన భూమికా ప్రస్తుతం కూడా తనదైన శైలిలో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది. రీసెంట్ గా ‘బటర్ ఫ్లై’, ‘సీతారామం’ చిత్రాలతో అలించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే భూమికా సోషల్ మీడియాలోనూ నిత్యం సందడి చేస్తోంది. నెట్టింట క్రేజ్ పెంచుకునేందుకు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు నెటిజన్లను కూడా తనవైపు తిప్పుకుంటోంది.

ముఖ్యంగా భూమిక ఈ వయస్సులోనూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. నాలుగు పదుల వయస్సు దాటినా సీనియర్ భామ చెక్కుచెదరని అందాలతో రచ్చ చేస్తోంది. వరుసగా తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది.

తాజాగా భూమికా పంచుకున్న ఫొటోల్లో అదిరిపోయింది.  బ్యూటీఫుల్ లుక్స్ కట్టిపడేసింది.  వయస్సు పెరుగుతున్నా కొద్దీ  మరింత అందంగా తయారవుతూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ మతులు పోగొడుతోంది.

లేటెస్ట్ పిక్స్ లో భూమికా బ్లాక్ అవుట్ ఫిట్ లో వెలిగిపోతోంది. చెక్కుచెదరని అందంతో సీనియర్ భామ ఆకర్షిస్తోంది. వెలిగిపోయే రూపసౌందర్యంతో, నిగనిగలాడే పెదవుల అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. తన మత్తు చూపులతో మైకం తెప్పించేసింది.
 

నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తున్న భూమికకు ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు కూడా ఎంకరేజ్ మెంట్ అందిస్తున్నారు. ఆమె ఫొటోలను లైక్సస్, కామెంట్లతో క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఇక భూమికా తాజాగా ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’ చిత్రంలో అలరించింది. 

Latest Videos

click me!