వైట్ షర్ట్, బ్లాక్ స్కర్ట్ లో అషురెడ్డి గ్లామర్ మెరుపులు.. అబ్బాయిలపై బోల్డ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్?

First Published | Feb 5, 2023, 6:01 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) ప్రస్తుతం టాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలను అందుకుంటోంది. అదే క్రమంలో సోషల్ మీడియాలోనూ అందాల విందుతో అదరగొడుతోంది.
 

జూనియర్ సమంతగా పేరొందిన యంగ్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ రచ్చచేస్తోంది.
 

ప్రస్తుతం అషురెడ్డి తన నటిస్తున్న ‘ఏ మాస్టర్ పీస్’ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా లోకేషన్ నుంచి పలు ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఫొటోషూట్ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో కనువిందు చేసిందీ బ్యూటీ. లేటెస్ట్ పిక్స్ అదిరిపోయాయి.
 


వైట్ షర్ట్, బ్లాక్ స్కర్ట్ లో అషురెడ్డి గ్లామర్ మెరుపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. అమ్మడు అందాల ధాటికి మంత్రముగ్ధులవుతున్నారు. టైట్ ఫిట్ లో అషురెడ్డి బాడీ కొలతలు చూపిస్తూ టెంప్టింగ్ గా పోజులిచ్చింది. అదిరిపోయే స్టిల్స్ తో కట్టిపడేస్తోంది.
 

తాజాగా ఈ ఫొటోలను పంచుకుంటూ అషురెడ్డి క్రేజీగా క్యాప్షన్ ఇచ్చారు. ‘తెల్ల చొక్కాలు ధరించిన అమ్మాయిలు అందంగా ఉండవచ్చు, కానీ అబ్బాయిలు మాత్రం నల్ల చొక్కాలు ధరిస్తే బాగుంటారంటూ’ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె ఫ్యాన్స్ కూడా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
 

మరో ఫొటోలో.. అషురెడ్డి వైట్ స్కోడా కారు పక్కన నిల్చుని స్టన్నింగ్ స్టిల్ తో ఆకట్టుకుంది. అయితే ఫొటోలో కారు నెంబర్ కూడా డిస్ప్లై అవడంతో.. నెటిజన్లు దానిపై  ఎన్ని ఛలాన్లు ఉన్నాయి.. ఎంత అమౌంట్ పేచేయాలో సూచిస్తూ అషురెడ్డిని ఆడేసుకుంటున్నారు. గతంలోనే పలు విధాలుగా నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఏదేమైనా అషురెడ్డి పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ మెరుపులు మరియు ఫ్యాషన్ సెన్స్ కు ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె పోస్టులను క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. ఇక అషురెడ్డి కూడా వరుసగా అవకాశాలను అందుకుంటోంది. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తొంది. 
 

Latest Videos

click me!