దూడ నోటికి మేతనందిస్తున్న పల్లెటూరి చిన్నది.. ఎర్రచీరలో కట్టిపడేస్తున్న అషురెడ్డి

First Published | Jan 29, 2023, 4:08 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. వరుస షూటింగ్ లతో బిజీగా అవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

డబ్ స్మాష్ వీడియోలతో సెన్సేషన్  క్రియేట్ చేసిన అషురెడ్డి జూనియర్ సమంతగా పేరొందింది. తన అందంతోనూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఈ క్రేజ్ తో నెమ్మదిగా యూట్యూబ్ లోనూ క్రేజ్ సాధించింది.
 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత యూట్యూబ్ స్టార్ గా మారిపోయింది. ఒకే ఇంటర్వ్యూతో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది. 
 


బిగ్ బాస్ రియాలిటీ షోలో రెండు సార్లు అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. అలాగే నటిగానూ అషురెడ్డి అవకాశాలను అందుకుంటోంది.

చివరిగా ‘ఫోకస్’ అనే కామెడీ హార్రర్ ఫిల్మ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆమె పెర్ఫామెన్స్ కు మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆయా చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ (AMC) అనే చిత్రంలో నటిస్తోంది.

A Master Piece  చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నెట్టింట తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లుచేస్తూ వస్తోంది. తాజాగా మరో చిత్రం షూటింగ్ కోసం ఏపీలోని పులివెందులకు వెళ్లింది.

అక్కడి.. పల్లె ప్రాంతంలోని అందాలను ఆస్వాదిస్తోంది. ఉదయమే పొద్దుతిరుగు పువ్వును ముద్దాడుతూ దర్శనమివ్వగా.. సాయంత్రం మూగజీవాలైన దూడకు మేత వేస్తూ కనిపించింది. ఎర్ర చీరలో విలేజ్ వైబ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Latest Videos

click me!