రేర్ ఫొటోస్ షేర్ చేసిన ‘లైగర్’ బ్యూటీ.. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో.. పిక్స్

First Published | May 21, 2023, 5:10 PM IST

‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) గతంలో ఎప్పుడూ అభిమానులతో పంచుకోని ఫొటోలను షేర్ చేసుకుంది. చైల్డ్ హుడ్ లో యంగ్ బ్యూటీ చాలా క్యూట్ గా ఉందంటూ ఫ్యాన్స్ పొగుడుతున్నారు.
 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన విషయం తెలిసిందే. కుర్రభామ హిందీ చిత్రాలతో మంచి ఫేమ్ దక్కించుకుంది. తన అందం, నటనతో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అనన్యకూ ఆశించిన మేర క్రేజ్ దక్కలేదనే చెప్పాలి.
 


మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవుతోందీ బ్యూటీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్ షూట్లు కూడా చేస్తూ బిజీ అయిపోతోంది. అప్పుడప్పుడు ముంబై వీధుల్లోనూ మెరుస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అనన్య ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇటీవల తన వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా తన చైల్డ్ హుడ్ ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

అనన్య షేర్ చేసిన పిక్స్ లో తన చిన్నప్పటి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నతనంలో కుర్రభామ ఎంతో క్యూట్ గా ఉంది. మరో ఫొటోలో తన చేతిపై ఉన్న గీతలు, టాటూ మాదిరి పేర్లను చూపిస్తూ ఆకట్టుకుంది. ఇప్పటికీ చేతిపై అలా రాసుకుంటూనే ఉంటుందని పరోక్షంగా ఫొటోల ద్వారా చెప్పుకొచ్చింది.
 

ఇక మరిన్ని ఫొటోలను తన రీసెంట్ షూటింగ్ స్పాట్ నుంచి షేర్ చేసింది. ఓ యాడ్ షూట్ కోసం అనన్య వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే థైస్ షోతో యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులు మెరిపించింది. దీంతో ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో అనన్య అందాన్ని పొగుడుతున్నారు.

Latest Videos

click me!