కొలనులో అమలాపాల్ జలకాలాట.. తడి అందాలతో మతిపోగొడుతున్న స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారంటే?

First Published | Feb 19, 2023, 3:53 PM IST

హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఓ హిందూ దేవాలయంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 
 

సౌత్ హీరోయిన్ అమలాపాల్ దక్షిణాది ఆడియెన్స్ లో తనదైన గుర్తింపును దక్కించుకున్నారు. ఇటీవల  రోటీన్ కు భిన్నంగా సినిమాల్లో నటిస్తున్న అమలాపాల్.. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆసక్తికరంగానే సాగిస్తున్నారు. 
 

అయితే, నిన్న మహాశివరాత్రి సందర్భంగా అమలాపాల్ ఆధ్యాత్మిక సేవలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఇడోనేషియాలోని బాలిలో గల హిందూ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న దేవాలయానికి చెందిన గుండములో సాన్నం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
 


ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించిన స్టార్ బ్యూటీ.. కొలనులో జలకాలాడుతూ ఆకట్టుకున్నారు. తడి అందాలతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే, ఈ ఫొటోలను పంచుకుంటూ అమలాపాల్ ఇంట్రెస్టింగ్  నోట్ ఒకటి రాసుకొచ్చారు. ‘నేను మార్చలేని వాటిని అంగీకరించేందుకు నాకు ఈనీటి ద్వారా శక్తిని ఇవ్వండి. నేను చేయగలిగిన వాటి కోసం కావాల్సిన శక్తి , ధైర్యం కావాలి’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ గా ఇచ్చారు. 
 

ఇక అమలాపాల్ క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ హిందూ ఆలయాలను సందర్శిస్తుండటం, హిందూ దేవుళ్లను గౌరవించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అభిమానులకు ఇలా అప్డేట్స్ అందిస్తున్నారు. 

అమలాపాల్ ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగులో చివరిగా ‘పిట్ట కథలు’ (Pitta Kathalu) చిత్రంతో అలరించింది. ఆతర్వాత నుంచి మలయాళం, తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోళా’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకోబోతోంది.  

Latest Videos

click me!