అమలాపాల్ బీచ్ సైడ్ ఫొటోస్.. బ్రాలో మలయాళీ భామ అందాల విందు..

First Published | Sep 4, 2023, 8:22 AM IST

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ బీచ్ లో దర్శనమిచ్చింది. అందాల జాతరతో మతులు పోగొడుతోంది. తాజాగా సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

స్టార్ హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) వెకేషన్ లో ఎంజాయ్  చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. గోవాలో రిలాక్స్ అవుతూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆ పిక్స్ ను ఫ్యాన్స్ తో  పంచుకుంది. 
 

మలయాళీ ముద్దుగుమ్మ వరుస చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది.  అందాల విందుతో ఫ్యాన్స్ తో పాటు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 


తాజాగా ఈ బ్యూటీ అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బీచ్ లో సేద తీరుతూ కనిపించింది. బ్రా, పొట్టి నిక్కరులో అమలాపాల్ అందాల ప్రదర్శన చేసింది. క్రేజీ హీరోయిన్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

టాలీవుడ్ లో అమలాపాల్ కొన్ని సినిమాలే చేసినా.. తన పెర్ఫామెన్స్ తో అందంతో గుర్తుండిపోయేలా చేసింది. ‘బెజవాడ’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘జెండాపై కపిరాజ్’ వంటి సినిమాలతో అలరించింది. చివరిగా ‘పిట్ట కథలు’ మూవీతో ఆకట్టుకుంది.
 

కొన్నాళ్లు అమలాపాల్ సినిమాల విషయంలో డేరింగ్ డిసీషన్ తీసుకుంటోంది. బోల్డ్ గా మారితోంది. తన పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక పిట్ట కథలు చిత్రంలో ఏకంగా బెడ్ సీన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 

ప్రస్తుతం హిందీ, మలయాళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ‘భోళా’లో స్పెషల్ అపీయరెన్స్ తో మెస్మరైజ్ చేసింది. మలయాళంలో ఈమె నటించిన మూడు సినిమాలు త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అప్పటి వరకు ఇలా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ వస్తోంది. 
 

Latest Videos

click me!