2013లో విడుదలైన జగద్గురు ఆదిశంకర చిత్రం చూసిన వారందరికీ నటుడు కౌశిక్ గురించి తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా పలు చిత్రాలలో కౌశిక్ నటించాడు. జగద్గురు ఆదిశంకర చిత్రంలో కౌశిక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రమే కాదు కన్నడలో ప్రసారమయ్యే సీరియల్ లో అయ్యప్ప స్వామి పాత్రలో నటించి కూడా మెప్పించాడు. కౌశిక్ ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. అతడి వివాహం జరిగింది. తాజాగా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.