పెద్దమ్మాయి అమెరికన్ ని చేసుకుంది, చిన్నమ్మాయికి పెళ్లి వద్దన్నాను... జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్ 

Published : Feb 13, 2023, 06:15 PM IST

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం జగపతిబాబుకు అలవాటు. తన జీవితాన్ని ఓ తెరిచిన పుస్తకంగా అభిమానులకు పరిచయం చేశాడు. ఆయన ఆలోచనలు కూడా సగటు ఇండియన్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి.   

PREV
17
పెద్దమ్మాయి అమెరికన్ ని చేసుకుంది, చిన్నమ్మాయికి పెళ్లి వద్దన్నాను... జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్ 


స్టార్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు జగపతిబాబు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ జగపతిబాబు అనేక ఒడిదుడుకులు, కష్టనష్టాలు చవిచూశారు. అందరిలానే జగపతిబాబు మాస్ హీరో కావాలనున్నారు. అది సాధ్యం కాలేదు. తనలోని స్ట్రెంగ్త్ ఏమిటో తెలుసుకొని లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రాల హీరోగా మారి సక్సెస్ అయ్యారు. ఈ ఇమేజ్ ఉన్న హీరోలు స్టార్ హీరోల మాదిరి కలకాలం రాణించలేరు. 

27

 1990 నుండి 2000 వరకు జగపతిబాబు కెరీర్ పీక్స్ లో ఉంది. తర్వాత గ్రాఫ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2010 నాటికి ఆయన కెరీర్ అయోమయంలో పడింది. హీరోగా సినిమాలు చేస్తున్నా ఒకటి కూడా ఆడేది కాదు. ఇదే సమయంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. డబ్బుల కోసం వచ్చిన ఆఫర్ కాదనకుండా చేశారు. 
 

37


విలన్ గా మారి జగపతిబాబు కెరీర్ మరలా నిర్మించుకున్నాడు. బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. లెజెండ్ మూవీలో విలన్ గా చేయడం ఆయనకు కలిసొచ్చింది. ప్రస్తుతం జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. 
 

47

తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దాదాపు నేను రూ. 1000 కోట్ల వరకు సంపాదించాను. అదంతా పోగొట్టుకున్నాను. జూదం వలన నా ఆస్తులు పోయాయి అనుకుంటారు. అది నిజం కాదు. కాసినోల్లో జూదం నేను సరదాకే ఆడతాను. డబ్బులు దాచడం నాకు తెలియదు. కొందరు బ్రోకర్స్ కూడా మోసం చేశారు. మొత్తంగా నా ఆస్తి పోవడానికి పూర్తి బాధ్యత నాదే... అని చెప్పుకొచ్చారు. 
 

57
Jagapathi Babu


నాకు తెలిసిందే సినిమానే. 35 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. సాహసం అనే మూవీలో సెట్స్ లో నాకు జరిగిన అవమానం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. వారం రోజులు నాకు అన్నం పెట్టలేదు. కనీసం తింటావా అని అడగలేదు. ఆ మూవీకి పని చేసిన లైట్ బాయ్ కూడా నా వద్దకు వచ్చి ఏడ్చాడు. వీడు ఎక్కడిపోతాడులే సినిమాల్లోనే నటిస్తాడని అవమానించేవారు. ఇతర భాషల్లో నటించి వస్తే మనోళ్లు గౌరవం ఇస్తారు... అని వాపోయారు. 

67
Jagapathi Babu

1992లో సాహసం విడుదల కాగా భానుచందర్ మరో హీరో. భాషా ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకుడిగా ఉన్నారు. ఇక కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి అమెరికన్ ని వివాహం చేసుకుంది. చిన్నమ్మాయికి మ్యారేజ్ వద్దన్నాను. కావాలంటే నువ్వే వెతికి చేసుకో అన్నాను. పార్ట్నర్ ఎంచుకునే విషయంలో వాళ్ళ మనం నియంత్రించకూడదు... అని జగపతిబాబు అన్నారు.

77

అలాగే ఆయనకు పెళ్లి, భార్య వంటి రిలేషన్స్ పై నమ్మకం లేదన్నారు. ప్రస్తుతం జగపతిబాబు సలార్ మూవీలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories