అట్టహాసంగా మొదలైన ఆస్కార్ వేడుక.. స్టైలిష్ గా మెరిసిన ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి.. హాజరైన దీపికా పదుకొణె

First Published | Mar 13, 2023, 6:46 AM IST

సినీ ప్రపంచం  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు సినీతారలు హాజరయ్యారు.  ‘ఆర్ఆర్ఆర్’ టీం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు.. హాలీవుడ్ స్టార్స్ రాకతో షాంపైన్ కార్పెట్ సందడి మారింది.

సినీ తారలకు అంత్యంత ప్రతిష్టాత్మకమైన Oscars 2023 అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా ప్రారంభమైంది.  ప్రపంచ వ్యాప్తంగా సినీ స్టార్స్ తో పాటు భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోగల డాల్బీ థియేటర్ వేదికగా మొదలైంది. షాంపైన్ కార్పెట్ పై ప్రపంచ సినీ తారలు హాజరై సందడి చేస్తున్నారు.
 

ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు ‘నాటు నాటు’ సాంగ్ ఒరిజనల్ స్కోర్ విభాగంలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ ఆస్కార్ వేడుక సందర్భంగా RRR టీం స్టైలిష్ గా మూస్తబైంది. ఈవెంట్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) అట్రాక్టివ్ వేర్స్ లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవతున్నాయి. 
 


ఆస్కార్ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) హాజరయ్యారు. బిగ్గెస్ట్  గ్లోబల్ ఈవెంట్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిశారు. ఈసందర్బంగా తన స్టైలిష్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంది. ఆస్కార్ ఈవెంట్ కు హాజరైనట్టు తెలిపింది. దీపికాకు ఆస్కార్ అవార్డు ప్రజెంటర్ గా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేడుకలో మెరిసింది.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్  ఆస్కార్ ఈవెంట్ ముందు నుంచే అమెరికాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ వేడుకలో ఇలా బ్లాంక్ పాంథర్ సూట్ లో స్టైలిష్  గా మెరిశారు. ప్రతిష్టాత్మకమైన వేడుకలో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకకు భార్య ఉపాసనతో కలిసి హాజరవడం విశేషం. ఈ సందర్భంగా ఈవెంట్ లో ఉపాసనతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 

అలాగే సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ సైతం వేడుక వద్ద ట్రెడిషనల్ లుక్ లో మెరిసిశారు. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. ఆస్కార్స్ వేదికపై ‘నాటు నాటు’సాంగ్ ను లైవ్ పెర్ఫామెన్స్ చేయబోతున్నారు. 

ఆస్కార్ వేడుకలో పెడ్రో పాస్కల్ (Pedro Pascal) తన సోదరి జేవిరాతో కలిసి మెరిశారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో ఇద్దరూ స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలా బాసెట్ (Angela Bassett) 95వ ఆస్కార్‌ వేడుకకు హాజరయ్యారు. బ్లాక్ పాంథర్ : వకాండ ఫరెవర్ మూవీలో సపోర్టింగ్ రోల్ విభాగంలో ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ప్రతిష్టాత్మక వేడుకలో వయోలైట్ అవుట్ ఫిట్ లో హాజరై ఆకట్టుకుంటోంది. 

ఆస్కార్ వేడుకలో ప్రముఖ హాలీవుడ్ నటి లేడీ గిగా మెరిశారు. బ్లాక్ టైట్ ఫిట్ లో అట్రాక్టివ్ లుక్ లో హాజరై అందరినీ ఆకట్టుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఫొటోకు ఆమె ఇచ్చిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Latest Videos

click me!