మాకు మాత్రం కరోనా రాదా.. సెక్స్ వర్కర్స్ కీలక నిర్ణయం

First Published | Mar 30, 2020, 1:08 PM IST

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని సోనాగచ్చి సెక్స్ వర్కర్ల నిలయం. ఇప్పుడు ఈ ప్రాంతం వెలవెల పోవడానికి కారణం కరోనా భయం ఒకటౌతే... ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటన మరో కారణం.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20వేల మంది పిట్టల్లా రాలిపోయారు. మరో నాలుగు లక్షల మంది వైరస్ సోకి ఇబ్బంది పడుతున్నారు. మాకెక్కడ అంటుకుంటుందో అని చాలా మంది వణికిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా మూడు వారాలపాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెక్స్ వర్కర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్ డౌన్ కాలంపాటు.. తాము కూడా తమ వృత్తికి దూరంగా ఉంటామని ప్రకటించారు.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా అది. నిత్యం.. వ్యభిచారిణిలు.. విఠులతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతం ఇప్పుడు.. జన సంచారం లేకుండా బోసిపోయింది.
అదే..పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని సోనాగచ్చి సెక్స్ వర్కర్ల నిలయం. ఇప్పుడు ఈ ప్రాంతం వెలవెల పోవడానికి కారణం కరోనా భయం ఒకటౌతే... ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటన మరో కారణం.
కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలీగానే.. అక్కడున్న మహిళలు.. వ్యభిచార వృత్తిని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వారి నిర్ణయం హర్షించదగ్గదే. కానీ, ఇప్పుడు వారి పరిస్థితి దిగజారుతోంది. ఆదాయం లేక, రోజు గడవాలంటే ఇబ్బందిగా మారిందట.
అటు.. బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్ జిల్లాలోనూ సెక్స్ వర్కర్లు పడుపు వృత్తిని ఆపేశారు. స్వచ్ఛంద సంస్థల అవగాహనతో తమ వృత్తికి అక్కడి మహిళలు బ్రేక్ ఇచ్చారు.
కరోనా లక్షణాలున్న వ్యక్తి ఒక్కరు వచ్చినా... అందరికీ కరోనా సోకే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మహిళలు వెల్లడించారు. ఓ స్వచ్ఛంద సంస్థ సెక్స్ వర్కర్లకు ఆర్థిక చేయూతను అందిస్తోంది
కాగా... స్వచ్ఛందంగా వారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ అభినందిస్తున్నారు. వారికి ఆ వృత్తి లేకపోతే కడుపు నిండదు అన్న విషయం తెలిసి కూడా సమాజ శ్రేయస్సు కోసం మంచి నిర్ణయం తీసుకున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

click me!