కరోనాపై పోరు: జగన్‌కు భారతీ సిమెంట్స్, కియా మోటార్స్ భారీ విరాళాలు

First Published Apr 2, 2020, 7:00 PM IST

కరోనా వైరస్‌ను కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ అదనపు ఖర్చులు, ఆదాయం తగ్గిపోయిన కారణంగా ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు కార్పోరేట్ సంస్థలతో పాటు సెలబ్రిటీ అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోట్లాది రూపాయలు విరాళంగా వస్తున్నాయి.

కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు రోజుల వేతనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ విరాళంగా ప్రకటించింది . ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు విరాళాలకు సంబంధించి వివరాలు అందిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్‌ ప్రసాద్‌, విజయకుమార్‌, ప్రద్యుమ్న, ఐఏఎస్‌ ఆఫీసర్స్ ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్
undefined
కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన కియామోటార్స్‌. విరాళాలకి సంబంధించిన వివరాలను క్యాంపు కార్యాలయంలో జగన్‌కు అందిస్తున్న కియా మోటర్స్ ఇండియా ఎండీ కుక్ హాయాన్ షిమ్
undefined
కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి క్యాంపు కార్యాలయంలో సీఎం కు రెండు కోట్ల రూపాయలు విరాళం అందజేస్తున్న శ్రీ సిటీ ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర. పక్కన ఎంపీ విజయసాయి రెడ్డి.
undefined
కోవిడ్‌ –19 నియంత్రణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖల నుంచి రూ.200.11 కోట్లు విరాళం. ఇందుకు సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
undefined
కోవిడ్‌ –19 సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి క్యాంపు కార్యాలయంలో జగన్‌కు ఐదు కోట్ల పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయల చెక్కును భారతి సిమెంట్స్ తరపున అందజేస్తున్న ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ.
undefined
click me!