Bajaj Finserv
UPI లైట్ ఎలా పని చేస్తుంది?
UPI లైట్ వెనుక ఉన్న మెకానిజం సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది. వినియోగదారులు తమ UPI-ప్రారంభించబడిన యాప్‌ల ద్వారా UPI లైట్‌ని ప్రారంభించవచ్చు. PhonePe, Bajaj Pay, Google Pay వంటి కొన్ని ప్రముఖ ఎంపికలు ఉన్నాయి. యాక్టివేట్ అయిన తర్వాత తక్కువ-విలువ లావాదేవీల కోసం ప్రత్యేక వాలెట్ సృష్టించబడుతుంది. వినియోగదారు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి వాలెట్ టాప్ అప్ చేయవచ్చు, సాధారణంగా ఒకేసారి 2,000 రూపాయల వరకు రోజవారీ పరిమితి ఉంటుంది. ప్రతిలావాదేవీ 200 రూపాయల వరకు ఉండటంతో ఎక్కువ చిన్న లావాదేవీలను నిర్వహించే అవకాశం ఉంది.
వాలెట్ లోడ్ అయిన తర్వాత, వినియోగదారులు తమ బ్యాంక్ సర్వర్‌ల నుండి రియల్ టైమ్ ధ్రువీకరణ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులను నిర్వహించవచ్చు. ఇది సర్వర్ రద్దీ అవకాశాలను బాగా తగ్గిస్తుంది. చిన్న లావాదేవీలు వేగంగా జరిగేలా చూస్తుంది. అదనంగా, UPI లైట్ చెల్లింపుల కోసం ఆఫ్‌లైన్ మోడ్‌లో పని చేస్తుంది కాబట్టి, వినియోగదారులు నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు కూడా లావాదేవీలు జరిపేందుకు అనుమతిస్తుంది.
UPI లైట్ ప్రయోజనాలు
1. వినియోగదారుల కోసం పెరిగిన సౌలభ్యం
UPI లైట్ అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి దాని సౌలభ్యం. మీరు కిరాణా సామాగ్రిని కొనుగోలు చేసినా, ప్రజా రవాణా కోసం చెల్లించినా లేదా చిన్న వస్తువులను కొనుగోలు చేసినా, UPI లైట్ నగదును తీసివేయాల్సిన అవసరం లేకుండా లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరగా చెల్లింపులు చేయవచ్చు. ఇది ప్రతి చిన్న చెల్లింపు కోసం PINని నమోదు చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
2. ఆఫ్‌లైన్ సామర్థ్యం
ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయగల సామర్థ్యం UPI లైట్ వాలెట్‌ల విప్లవాత్మక అంశం. ఈ ఫీచర్ వినియోగదారులకు వారి ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా ఉన్నప్పటికీ లేదా ఉనికిలో లేనప్పుడు కూడా లావాదేవీలను కొనసాగించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది. భారతదేశంలో మొబైల్ కనెక్టివిటీ కొన్ని ప్రాంతాలలో స్పాట్టీగా ఉంటుంది. ఇది పట్టణ, గ్రామీణ జనాభా రెండింటికీ ప్రధాన ప్రయోజనకారిగా ఉంటుంది.
3. చిన్న మొత్తాల చెల్లింపులే టార్గెట్
UPI లైట్ చిన్న మొత్తాల చెల్లింపుల కోసం రూపొందించబడింది. ఇది భారతదేశంలో రోజువారీ లావాదేవీలలో గణనీయమైన భాగాన్ని ఏర్పరుస్తుంది. చిన్న-విలువ చెల్లింపులపై దృష్టి సారించడం ద్వారా UPI లైట్ సమర్థవంతమైన, క్రమబద్ధీకరించబడిన ప్రక్రియను సృష్టిస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైన, వేగవంతమైన, UPI పిన్‌ను నమోదు చేయడం లేదా లావాదేవీ ఫెయిల్ వ్యవహరించడం వంటి రెగ్యులర్ UPI అడ్డంకులు లేకుండా చేస్తుంది.
4. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం
భారతదేశం తన డిజిటల్ అవస్థాపనను విస్తరించడంలో గణనీయమైన పురోగతి సాధించింది. అయితే ఇంటర్నెట్ సదుపాయం అంత నమ్మదగినది కాని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో సవాళ్లు ఉన్నాయి. UPI లైట్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఈ అంతరాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అటువంటి ప్రాంతాల్లోని వ్యక్తులు నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపులను స్వీకరించేలా చేస్తుంది.
5. భద్రత
UPI లైట్‌కి భద్రత ప్రధానం. రెగ్యులర్ UPI సిస్టమ్ వలె UPI లైట్ కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లచే నిర్వహించబడుతుంది. ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయగలిగినప్పటికీ వినియోగదారులు తమ UPI పిన్ ద్వారా వాలెట్ సృష్టి, వాలెట్ టాప్-అప్‌లను తప్పనిసరిగా ప్రామాణీకరించాలి, అధీకృత వినియోగదారులు మాత్రమే తమ UPI లైట్ బ్యాలెన్స్‌ని లోడ్ చేయగలరు. అంతేకాకుండా, లావాదేవీ పరిమితులు తక్కువగా ఉన్నందున ఒకవేల మోసాలు జరిగినా ప్రమాదం తక్కువగా ఉంటుంది.